HomeTelugu Big Storiesబాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు..

బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు..

Balakrishan Birthday

నటసింహం నందమూరి బాలకృష్ణ 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా ఆయనకు klapboard జన్మదిన శుభాకాంక్షలు. 1960 జూన్ 10న చెన్నైలో ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు జన్మించాడు బాలయ్య. విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే జరిగింది. ఇంటర్‌ పూర్తికాగానే సినిమాలోకి రావాలని అనుకున్నాడు బాలయ్య. కానీ తండ్రి కోరికమేరకు నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రితో పాటు బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. హీరోగా బాలయ్య ఇప్పటివరకు 105 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. ఈయన ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. బాలయ్య 2014 శాసనసభ ఏన్నికలలో మొదటి సారి శాసనసభకు ఎన్నిక అయ్యాడు. ఈయన జీవిత భాగస్వామి వసుంధర. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. త్వరలోనే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలయ్య మరేన్నో చిత్రాల్లో నటించాలని.. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. మరోసారి ఆయనుకు జన్మదిన శుభాకాంక్షలు..

Also Read: https://www.klapboardpost.com/balakrishna-birthday-posters-viral/

Recent Articles English

Gallery

Recent Articles Telugu