HomeTelugu TrendingHappy Birthday JR NTR: ఎరక్కపోయి ఇరుక్కుంటున్న ఎన్టీఆర్‌!

Happy Birthday JR NTR: ఎరక్కపోయి ఇరుక్కుంటున్న ఎన్టీఆర్‌!

Happy Birthday JR NTR

Happy Birthday JR NTR: మూవీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు మనవడిగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్‌తో పాన్‌ ఇండియా హీరోగా మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌గా ఎదిగాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. సాధారణంగా ఎన్టీఆర్‌ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. అయితే ఒక హీరోకి అభిమానులు ఏ రేంజ్‌లో ఉంటరో.. ట్రోలర్స్‌ కూడా అదే రేంజ్‌లో ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా ట్రోల్‌ చేస్తూ ఉంటారు. జూనియర్ విషయంలో కూడా అంతే. ఎంతమంది అభిమానులున్నారో ట్రోలర్స్ కూడా అదే సంఖ్యలో ఉన్నారు.

ఫస్ట్‌ నుంచి జూనియర్ అంటే గిట్టనివారు సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయంపై ట్రోల్స్‌ చేస్తూ ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ వేడుకల సమయంలో కూడా ట్రోలింగ్ చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ హాలీవుడ్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు తన స్లాగ్‌పై ట్రోల్స్‌ చేశారు. కొందరు ఎన్టీఆర్‌ మాట్లాడే తీరు చాలా బాగుంది అని మెచ్చుకుంటే.. మరికొందరు మాత్రం కావాలి అనే యాక్టింగ్‌ చేస్తున్నాడు.. అంత అవసరం లేదు అని ట్రోల్స్‌ చేశారు. ఇక ఇదే టైమ్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కు మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయి అని వార్తలు వచ్చాయి.

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన ‘జై ల‌వ‌కుశ’ అప్పట్లో కాంట్రవర్సీగా మారింది. పూరి జ‌గ‌న్నాథ్ ఎన్టీఆర్‌కు చెప్పిన ఓ క‌థ‌లో ఓ క్యారెక్ట‌ర్‌కు నెగిటివ్ షేడ్‌తో పాటు న‌త్తి ఉంటుంద‌ని, ఇప్పుడు అదే క్యారెక్ట‌ర్ నుంచి జై ల‌వ‌కుశలోని జై క్యారెక్ట‌ర్‌ను కాపీ కొట్టారంటూ పూరి ఫైర్ అవుతోన్న‌ట్టు వార్త‌లు వచ్చాయి. ఆ తరువాత ఈ ఇష్యూపై పూరి – ఎన్టీఆర్ రాజీకి వచ్చారు.

తారకరత్న మృతిచెందిన సమయంలో కూడా ఎన్టీఆర్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. 2023 లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సమయంలో కూడా ఎన్టీఆర్‌ ట్రోలింగ్‌ని ఎదుర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలకు రాజకీయ రంగంతోపాటు సినీ రంగంలోని ప్రముఖులంతా హాజరయ్యారు.

వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రాలేదని ట్రోలింగ్ జరిగింది. రామ్ చరణ్, సిద్ధు జొన్నలగడ్డ, నాగచైతన్య తదితర కుర్ర హీరోలంతా హాజరైనప్పటికీ జూనియర్ రాకపోవడం అప్పట్లో కాంట్రవర్సీగా మారింది. వాస్తవానికి ఆరోజు తాను రాలేనని ముందే చెప్పాడు. ఆ వేడుకకు ప్రమోషన్స్ కోసం శ్రేయాస్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను ఉపయోగించుకున్నారు. దీన్ని అర్థం చేసుకోలేని ట్రోలర్స్ జూనియర్ పై పదే పదే విమర్శలు చేశారు.

2024లోఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. జరిగిన సంఘటన కూడా కాంట్రవర్సీగా మారింది. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు తారక్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బాలకృష్ణ అతడి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి చేరుకున్నారు. ఆయన తన తండ్రికి అంజలి ఘటించారు. బాలకృష్ణ వెళ్లిపోయిన తర్వాత ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన తారక్‌ ఫ్లెక్సీలను బాలయ్య అభిమానులు తొలగించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలిగించారనే ప్రచారం జరుగుతోంది. వాటిని వెంటనే తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశిస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

తారక్‌ రాజకీయాలకు దూరంగా ఉంటాడు అయినా కూడా.. ఏపీ రాజకీయాల్లో కూడా తారక్‌ పేరు ఎప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటుంది. తరచూ తారక్‌ను సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తారు ఆయన ఫ్యాన్స్‌. ఇటీవలే చంద్రబాబు అరెస్ట్‌ టైమ్‌లో కూడా ఎన్టీఆర్‌ స్పందించకపోవడం వైరల్‌గా మారింది. ఈ విషయంపై స్పందించిన బాలకృష్ణ అది వారి ఇష్టం.. అని సంచల వ్యాఖ్యలు చేశాడు.

ఇక తాజాగా ఎన్టీఆర్.. ఓ ల్యాండ్ వివాదంపై హై కోర్టును ఆశ్రయించారు. సుంకు గీతలక్ష్మి అనే మహిళ నుంచి 2003లో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ సమయంలో స్థలంపై ఒక బ్యాంకులో లోన్ ఉన్నట్లు చెప్పింది గీత. దానిని క్లియర్ చేసి.. స్థలాన్ని కొనుగోలు చేశారు ఎన్టీఆర్. కానీ ఆ తర్వాత 3,4 బ్యాంకులు తమ వద్ద లోన్ తీర్చకపోవడంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. గీత ఫేక్ డాక్యుమెంట్లతో ఆయా బ్యాంకుల నుంచి మార్ట్ గెజ్ ద్వారా లోన్ పొందింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. ఇది కూడా కాంట్రవర్సీగా మారింది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu