HomeTelugu Trendingహ్యాపీ బర్త్‌ డే 'గుమ్మడి వరలక్ష్మీ'

హ్యాపీ బర్త్‌ డే ‘గుమ్మడి వరలక్ష్మీ’

Happy Birthday gummadi Vara

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్‌ జగదీష్‌. ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు హీరోయిన్ రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ ను విడుదల చేసింది.

ఈ సినిమాలో రీతూ ‘గుమ్మడి వరలక్ష్మీ’ అనే పాత్రలో నటిస్తోంది. జగదీష్ నాయుడితో గుమ్మడి వరలక్ష్మీ చేసే రొమాన్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తుందని తెలుస్తోంది. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదల చేయనున్నారు. జగపతి బాబు, నాజర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu