Homeతెలుగు News'హనుమాన్‌' ప్రమోషన్స్‌ షూరు

‘హనుమాన్‌’ ప్రమోషన్స్‌ షూరు

hanuman promotions begins f

యంగ్‌ డైరెక్టర్‌ ప్ర‌శాంత్ వ‌ర్మ దర్శతక్వంలో..తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రం ‘హనుమాన్’. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది, ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా సంక్రాంతి 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అయితే విడుద‌ల‌కు ఇంకా రెండు నెల‌లు ఉండ‌టంతో.. ఇప్ప‌టినుంచే ప్రమోష‌న్స్ ప్రారంభించనున్నారు మూవీ యూనిట్‌. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. హనుమాన్ సినిమాకు సంబంధించి ఈ మంగళవారం నుంచి ఆన్-గ్రౌండ్ ప్రమోషన్‌లను ప్రారంభించిన‌ట్లు ప్రకటించారు.

ఈ సినిమా విడుద‌ల తేదీ వ‌ర‌కు ప్రతి మంగళవారం #HanuMan సినిమా నుంచి అద్భుతమైన అప్‌డేట్ ఇస్తాం అంటూ ప్ర‌శాంత్ వ‌ర్మ రాసుకోచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అస్రిన్‌ రెడ్డి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా, వెంకట్‌ కుమార్‌ జెట్టీ లైన్‌ ప్రొడ్యూసర్‌గా, కుశాల్‌ రెడ్డి అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హనుమాన్‌ చిత్రానికి గౌరహరి-అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!