ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా హనుమాన్ మూవీ నైజాం హక్కులను మైత్రీ మూవీస్ ఏకంగా రూ.7.2 కోట్లకు దక్కించుకోవడం విశేషం. ఓ చిన్న సినిమాకు ఇది చాలా పెద్ద మొత్తమే అని చెప్పాలి. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ హనుమాన్ ఏకంగా రూ.23 కోట్ల బిజినెస్ చేసింది. ఈ మూవీ నుంచి గతంలో వచ్చిన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో సంక్రాంతి బరిలోని పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
ఈ మూవీలో కోతి పాత్రకు ప్రముఖ నటుడు రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. ఈ మూవీలో అమృతా అయ్యర్ ఫిమేల్ హీరోయిన్‌గా కనిపిస్తోంది. వినయ్ రాయ్ విలన్ పాత్ర పోషించాడు. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.
ఈసినిమా తెలుగు, హిందీ, మరాఠీ,తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లోనూ రిలీజ్ కానుండటం విశేషం. ఈ మూవీని నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. హరి గౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు.