
Prabhas Hanu Raghavapudi movie:
ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది యాక్షన్, లవ్ ఎలిమెంట్స్‌తో కూడిన పీరియాడిక్ డ్రామా. ఈ చిత్రాన్ని హాను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు షూట్ చేసిన విజువల్స్‌ను చూసి మైత్రి మూవీ మేకర్స్ టీమ్ చాలా సంతృప్తిగా ఉంది. ప్రభాస్ కూడా హాను పనితీరును మెచ్చుకుంటూ మరో సినిమా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
‘ఫౌజీ’ పూర్తయ్యేలోపే ప్రభాస్ హాను రాఘవపూడికి మరో సినిమా ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు, ఒక ప్రముఖ నిర్మాతను కలిసి ముందుగా అడ్వాన్స్ కూడా ఇచ్చేలా మాట్లాడాడట. ఈ విషయాన్ని ప్రభాస్ తన సన్నిహితులతో కూడా షేర్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ షూట్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ‘స్పిరిట్’, ‘కల్కి 2898 AD సీక్వెల్’, ‘సలార్ 2’ సినిమాల కోసం డేట్స్ ఇవ్వాలి. హాను ఈ సమయం లో మరో సినిమా పూర్తి చేసి తర్వాత ప్రభాస్‌తో పని చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే మరుతి డైరెక్షన్‌లో ‘రాజా సాబ్’ షూట్‌కు తిరిగి వస్తాడు. ప్రభాస్ – హాను రాఘవపూడి కాంబో మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి!