HomeTelugu Trendingహన్సిక ఫొటో వైరల్‌..

హన్సిక ఫొటో వైరల్‌..

4 9దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హన్సిక.. అనతికాలంలోనే టాలీవుడ్ లో పాపులర్ అయింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయినట్టు కనిపిస్తున్నది ఈ అమ్మడు. కోలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం హన్సిక తన 50 వ సినిమా మహా చేస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దమౌతున్న తరుణంలో ఓ వివాదం చోటు చేసుకున్నది.

హన్సికకు సంబంధించిన ఓ ఫోటోను యూనిట్ రిలీజ్ చేసింది. అందులో హన్సిక బాబా గెటప్ లో ఓ కుర్చీలో కూర్చొని సిగార్ తాగుతుంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో వారణాసి ఇమేజ్ ఉండటం వివాదంగా మారింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఫోటో ఉందని కొంతమంది గొడవ చేస్తున్నారు. కథ డిమాండ్ మేరకు మాత్రమే అలా చిత్రికరించవలసి వచ్చిందని మూవీయూనట్‌ చెప్తున్నది. ఇందులో హన్సిక మోసాలు చేసే యువతిగా కనిపిస్తుందట. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu