స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హన్సిక. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్లతో దుసుకుపోయింది. టాలీవుడ్ తో పాటు, తమిళ పరిశ్రమలో కూడా బీజీగా మారిపోయింది ఈ అమ్మడు. ఈ మధ్య కాస్త జోరు తగ్గిన హన్సిక పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ వ్యాపారవేత్తను హన్సిక పెళ్లాడబోతోందంటూ ఓ వెబ్ సైట్ ప్రచురించింది. ఆ తర్వాత నెటిజన్లు ఈ వార్తను వైరల్ చేశారు.
ఆ వార్త చూసి హన్సిక ఆశ్చర్యానికి గురయ్యారు. ‘పుకార్లు.. దేవుడా.. ఇంతకీ వరుడు ఎవరు?’ అని పేర్కొంటూ రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ వార్తను చూసిన హన్సిక స్నేహితుడు ‘ఓ మై గాడ్.. ఇప్పటివరకూ ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు?’ అని ఆమెకు ట్వీట్ చేశాడు. ‘నాక్కూడా ఇప్పుడే తెలిసింది. అందుకే చెప్పలేకపోయాను (నవ్వుతున్న ఎమోజీలు)’ అని సమాధానమిచ్చారు. తన గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. హన్సిక ప్రస్తుతం ‘మహా’, ‘పార్ట్నర్’ తమిళ చిత్రాల్లో నటిస్తోంది.