హీరోయిన్ హన్సిక వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు, బిజినెస్ పార్ట్ నర్ సొహైల్ ను ఆమె పెళ్లాడారు. జైపూర్ లోని ఒక రాజకోటలో వీరి వివాహం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. సింధి సంప్రదాయంలో పెళ్లిని నిర్వహించారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా… సొహైల్ కు రెండో వివాహం కావడం గమనార్హం. హన్సిక స్నేహితురాలితోనే ఆయనకు తొలి వివాహం అయింది. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ఆ తర్వాత హన్సిక, సొహైల్ మధ్య ప్రేమాయణం మొదలైంది. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://www.instagram.com/p/ClxON1IPMlE/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/ClxQV2jP0R8/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/reel/CltnPDwsORY/?utm_source=ig_web_copy_link