HomeTelugu TrendingThalapathy69 డైరెక్టర్ H Vinodh ఇంతకుముందు తీసిన సినిమాలు ఇవే

Thalapathy69 డైరెక్టర్ H Vinodh ఇంతకుముందు తీసిన సినిమాలు ఇవే

H Vinodh filmography increases the buzz on Thalapathy69
H Vinodh filmography increases the buzz on Thalapathy69

H Vinodh movies:

తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ సినిమాలకి గుడ్ బై ప్రకటించేసారు. ఇకపై కేవలం రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి పూర్తిగా దూరమయ్యేలోపు.. ఇన్ని సంవత్సరాలు తనను ఎంతగానో ఆదరిస్తూ ప్రేమించిన ఫ్యాన్స్ కోసం ఒకే ఒక్క ఆఖరి శ్రమ తీయాలని నిర్ణయించుకున్నారు.

అలా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమానే Thalapathy69. విజయ్ హీరోగా నటించబోతున్న ఆఖరి సినిమా ఇది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మళ్లీ విజయ్ ను వెండి తెర మీద చూడటానికి.. ఫ్యాన్స్ కి పాత సినిమాలు రీ రిలీజ్ చేసుకోవడం తప్ప.. మరొక ఆప్షన్ ఉండదు. ఈ నేపథ్యంలో ఆఖరి సారిగా విజయ్ ని వెండి తెర మీద చూడటానికి.. ఫాన్స్ కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

అలాంటి క్రేజీ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు H Vinodh. దీంతో అసలు గతంలో ఈ హెచ్ వినోద్ ఎలాంటి సినిమాలు చేశారు అనే ఆసక్తి అందరిలో మొదలైంది. 2014లో తమిళ్లో సత్వరంగా పెట్టే అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు హెచ్ వినోద్. తెలుగులో ఇదే సినిమా బ్లఫ్ మాస్టర్ అనే టైటిల్ తో రీమేక్ అయింది.. కానీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది.

ఆ సినిమా తర్వాత హెచ్ వినోద్.. కార్తి హీరోగా 2017లో.. తీరన్ అధిగారం ఒండ్రు అనే సినిమాకి దర్శకత్వం వహించారు. తెలుగులో ఖాకీ అనే టైటిల్ తో విడుదలైన ఈ సినిమా రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా హెచ్ వినోద్ మూడుసార్లు అజిత్ హీరోగా సినిమాలు చేశారు.

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన పింక్ సినిమాకి రీమేక్ గా అజిత్ హీరోగా.. హెచ్ వినోద్ నెర్కొండ పార్వై అనే సినిమా తీశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వాలిమై, తునివు అంటూ మరొక రెండు సినిమాలు అజిత్ తో తీశారు. రెండు సినిమాలు తమిళ్ లో మంచి విజయాలు అందుకున్నాయి కానీ తెలుగులో అంతంత మాత్రం గాని ఆడాయి.

Read More: GOAT కి నో చెప్పిన స్టార్ హీరోయిన్.. సినిమా విడుదల అయ్యాక ఏమందో తెలుసా?

అయితే హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఖాకీ సినిమాకి.. ఇప్పటికీ తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మరోవైపు తమిళ్ లో హెచ్ వినోద్ తీసిన సినిమాలు అన్ని సూపర్ హిట్లే అయ్యాయి. దీంతో ఇప్పుడు తలపతి 69 సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ ఆఖరి సినిమా కాబట్టి కచ్చితంగా తెలుగులో కూడా విజయ్ ఫ్యాన్స్ చూస్తారు. మరోవైపు హెచ్ వినోద్ కెరియర్ గ్రాఫ్ వల్ల కూడా సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయని చెప్పుకోవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu