HomeTelugu Trendingవిజయ్ దేవరకొండకు జిమ్‌ కష్టాలు..

విజయ్ దేవరకొండకు జిమ్‌ కష్టాలు..

8 3

టాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ఒక మూవీను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఫైటర్’ ..అనే టైటిల్స్ ను పరిశిలీస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ కి తగినట్టుగా విజయ్ దేవరకొండ మంచి ఫిట్ నెస్ తో కనిపించవలసి వుంది. అందువలన ఆయన జిమ్ లో గట్టి కసరత్తులు చేస్తున్నాడు.

అయితే కరోనా కారణంగా విధించిన కర్ఫ్యూ కారణంగా జిమ్ లు కూడా మూతబడిపోయాయి. ఒకవేళ అందుబాటులో వున్నా, ప్రస్తుతం వాటిని ఉపయోగించలేని పరిస్థితి. చాలామంది హీరోలు తమ ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఈ హీరో ఇంకా తన ఇంట్లో జిమ్ సెట్ చేసుకోలేదు. అందువలన వర్కౌట్స్ చేసే విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడట. విజయ్
ఫిట్‌నెస్ విషయంలో తేడా వస్తే, షూటింగ్ వాయిదా పడే అవకాశం లేకపోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu