HomeTelugu TrendingKingston OTT లోకి ఎప్పుడు వస్తుంది అంటే..

Kingston OTT లోకి ఎప్పుడు వస్తుంది అంటే..

GV Prakash’s Kingston OTT Release Date Confirmed
GV Prakash’s Kingston OTT Release Date ConfirmedGV Prakash’s Kingston OTT Release Date Confirmed

Kingston OTT release date:

సినిమా ప్రేమికులారా! ఎడ్వెంచర్, థ్రిల్లర్, హారర్ కలిపిన ‘Kingston’ సినిమాని మర్చిపోలేదుగా? ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జివి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 7, 2025న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. కామల్ ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇకపోతే థియేటర్‌లో మిస్ అయినవాళ్లకు గుడ్ న్యూస్! ‘Kingston’ OTT & టీవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. ఏప్రిల్ 13, 2025న జీ5 (OTT) మరియు జీ తమిళ్ (టీవీ) ద్వారా సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. అయితే, తెలుగు వెర్షన్ గురించి ఇంకా క్లారిటీ లేదు. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఈ మూవీలో జివి ప్రకాష్‌కు జోడిగా దివ్యభారతి నటించింది. ఇటీవలే ఆమె జివి ప్రకాష్‌తో రిలేషన్‌షిప్ రూమర్స్‌ను ఖండించిందని తెలుసు కదా! క్యాస్టింగ్ విషయానికి వస్తే చేతన్, అళగమ్ పెరుమాళ్, ఇలంగో కుమరవేల్, సబుమోన్ అబ్దుసమద్, ఆంటోనీ, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచందిరన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాని Zee Studios & Parallel Universe Pictures నిర్మించాయి. థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఇది మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది.

తెలుగు వెర్షన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. అందరికీ ఒకేరోజు స్ట్రీమింగ్ ఉంటుందా లేదా అన్నది కూడా ఆసక్తికరమైన విషయమే! మరి, ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారా? మీ కామెంట్స్ చెయ్యండి!

ALSO READ: రెమ్యూనరేషన్ విషయంలో Rashmika Mandanna కొత్త డిమాండ్ విని నిర్మాతలు షాక్

Recent Articles English

Gallery

Recent Articles Telugu