టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్, తమన్నా భాటియా జంటగా నటించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నేడు వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘శీతాకాలం.. మంచులో మనసులు తడిసి ముద్దయ్యే కాలం.. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చనికాలం..’ అంటూ ట్రైలర్ మొదలైంది. కోమలి, అమ్ము, దివ్య.. ఇలా చాలామందినే ప్రేమించాడు హీరో. చివరగా నిధి.. ఆమెతో ప్రేమలో పడలేదంటూనే ఇద్దరి మధ్య లవ్ స్టోరీని చూపించాడు దర్శకుడు.
మరి ఆ అమ్మాయిల్లో హీరో కరెక్ట్ పార్ట్నర్ ఎవరనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించగా భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్.ఎస్. రెడ్డి, చినబాబు నిర్మిస్తున్నారు. కావ్యా శెట్టి, మేఘా ఆకాశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, లైన్ ప్రొడ్యూసర్: సంపత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి, రాఘవ సూర్య.