HomeTelugu Big Storiesరివ్యూ: గుంటురోడు

రివ్యూ: గుంటురోడు

నటీనటుడు: మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్, రాజేంద్ర ప్రసాద్, సంపత్ రాజ్, కోటశ్రీనివాసరావు
తదితరులు
సంగీతం: డి.జె.వసంత్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
నిర్మాతలు: శ్రీవరుణ్ అట్లూరి
కథ-కథనం-దర్శకత్వం: ఎస్.కె.సత్య
ఎన్నో రోజులుగా మంచి హిట్ సినిమా కోసం ఎదురుచూస్తోన్న మంచు మనోజ్ ఈసారి దర్శకుడు సత్య చెప్పిన కమర్షియల్ లైన్ నచ్చడంతో ‘గుంటూరోడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మనోజ్ ఆశించిన సక్సెస్ ను ఈ సినిమా ద్వారా అందుకున్నాడో.. లేదో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
కన్నా(మంచు మనోజ్)ను చిన్నప్పటి నుండి ఎంతో గారాభంగా పెంచుకుంటాడు తన తండ్రి సూర్యనారాయణ(రాజేంద్రప్రసాద్). కన్నా ఎదురుగా అన్యాయం జరిగితే సహించలేడు. అదే కారణంగా చాలా మందిని కొడుతూ ఉంటాడు. అటువంటి కన్నా.. అమృత(ప్రగ్యాజైస్వాల్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మొదట కన్నాను పట్టించుకోని అమృత మెల్లమెల్లగా అతడి ప్రేమలో పడుతుంది. అమృత గుంటూరులోని క్రిమినల్ లాయర్ శేషు చెల్లెలు. శేషుకి అహంకారం, పొగరు, చిరాకు చాలా ఎక్కువ. అదే చిరాకుతో కన్నా స్నేహితుడిని కొడతాడు. దీంతో కన్నా శేషుతో గొడవపడతాడు. తన మీద చెయ్యి వేసిన కన్నా బ్రతికి ఉండడానికి వీల్లేదని శేషు తన మనుషుల సహాయంతో కన్నాను గాలిస్తాడు. కన్నాను ఓ రేప్ కేసులో ఇరికించి తను ఎమ్మెల్యే కావడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు శేషు. మరి శేషు అనుకున్నట్లుగా ఎమ్మెల్యే అయ్యాడా..? కన్నా రేప్ కేసు నుండి
బయటపడ్డాడా..? శేషు తన పగను తీర్చుకున్నాడా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కొత్త కథలు వస్తున్నాయి. కానీ మేము అలా ఆలోచించము రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే చేస్తామని పట్టుబట్టి మరీ ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కొందరు దర్శకుడు. ఈ చిత్ర దర్శకుడు సత్య కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములానే ఎన్నుకున్నాడు. హీరో విలన్ మధ్య గొడవ, ఆ విలన్ కు హీరోయిన్ కు బంధుత్వాన్ని పెట్టడం, హీరో విలన్ ను ఓడించి హీరోయిన్ ప్రేమను గెలుచుకోవడం. ఇప్పటికే కుప్పలుతెప్పలుగా వచ్చిన ఇటువంటి సినిమాల బాటలోకే ఈ సినిమా కూడా చేరింది.

కథ, కథనాలు బలంగా లేనప్పుడు టెక్నికల్ గా సినిమా ఎంత స్టాండర్డ్స్ లో ఉన్నా వృద్ధానే. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ ఏవీ కూడా సినిమాకు సహాయపడలేకపోయాయి. సినిమా మొదటి భాగం మొత్తం హీరో, హీరోయిన్ చుట్టూ తిరగడమే సరిపోయింది. ఇంటర్వల్ బ్యాంగ్ కు పెద్ద ఫైట్ చూపించి విలన్ తో హీరో సవాల్ చేసే సీన్ తో బ్రేక్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో కావాలని సినిమాను సాగదీయడం కోసం అన్నట్లుగా అనవసరపు కామెడీ సన్నివేశాలు, పాటలను జోడించారు. రొటీన్ చెత్త క్లైమాక్స్ తో సినిమాను ముగించారు. ఏ ఫ్రేములో కూడా సినిమాలో కొత్తదనం కనిపించదు సరి కదా డైలాగ్స్ తో ఎమోషన్ లేని ఎమోషన్ సీన్స్ తో విసుగు పుట్టించేశారు.

మంచు మనోజ్ తన పాత్రలో ఎంతగా ఇన్వాల్వ్ అయి నటించినా.. లాభం లేకపోయింది. ఎమోషనల్ సీన్స్ ఎప్పుడు చక్కటి హావభావాలు ప్రదర్శించే మనోజ్ ఈసారి మాత్రం ఎందుకో ఫెయిల్ అయ్యాడు. ప్రగ్యజైస్వాల్ పాత్ర కేవలం పాటలకు కొన్ని సీన్స్ కు పరిమితమైంది. సంపత్, రాజేంద్రప్రసాద్ లు తమ పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధుల్లో ఓకే అనిపించారు. ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ లో వచ్చిన చాలా కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. బి,సి ఆడియన్స్ కు అయినా.. సినిమా కనెక్ట్ అవుతుందో.. లేదో చెప్పలేని పరిస్థితి. మరి ఈ గుంటూరోడు కనీస వసూల్లనైనా రాబట్టగలుగుతాడో.. లేదో.. చూడాలి!
రేటింగ్: 2/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu