క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మనోజ్ మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెరకెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. అద్భుతమైన కధ కథనాలతో, తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అశేష స్పందన లభిస్తుంది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ చిత్ర ట్రైలర్ కి, ఆడియో కి మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ రావడం విశేషం .
ఈ సందర్భంగా…చిత్ర నిర్మాత వరుణ్ అట్లూరి మాట్లాడుతూ.. ”లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా గుంటూరోడు సినిమాలో మనోజ్ తన యాక్షన్ తో ప్రేక్షకులను అలరిస్తారు. మనోజ్, ప్రగ్యా జైస్వాల్,S.K. సత్య లతో సహా యూనిట్ అందరి సపోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైలర్ కు, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వస్తుంది . ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుంటున్న మా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 3 వ తేదీన విడుదల చేయబోతున్నాము అని” దర్శక నిర్మాతలు తెలియచేశారు.