HomeTelugu Trendingగుంటూరు కారం మేకింగ్ వీడియో

గుంటూరు కారం మేకింగ్ వీడియో

Guntur Kaaram 3

సంక్రాంతికి మంచి మాస్ ఘాటుతో రూపొందించిన ‘గుంటూరు కారం’ సినిమాతో బరిలోకి దిగాడు మహేష్ బాబు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. ఈ మూవీ రిలీజ్‌కు ఒక రోజు ముందుగానే మేకింగ్ వీడియో షేర్ చేశాడు మహేష్‌బాబు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఆన్ సెట్ టు ఆన్ స్క్రీన్ అనే క్యాప్షన్ తో గుంటూరు కారం మేకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సినిమా షూటింగ్ సందర్భంగా నటీనటులు సరదాగా గడిపిన క్షణాలను ఈ వీడియోలో చూపించడం విశేషం.

గుంటూరు కారం మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన ఓ భారీ సెట్‌ను ఈ మేకింగ్ వీడియోలో చూడొచ్చు. సినిమా చాలా వరకూ దీని చుట్టూనే తిరగనున్నట్లు అర్థమవుతోంది. మహేష్ సెట్లోకి అడుగుపెట్టడం నుంచి ఈ వీడియో మొదలవుతుంది. ఆ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కూర్చొని అతడు సరదాగా నవ్వుతూ కనిపించాడు.

తర్వాత ఈ భారీ సెట్ ఎలా వేశారో కూడా చూపించారు. ట్రైలర్‌లో ప్రధానంగా చూపించిన ఫైట్ సీక్వెన్స్‌లను ఎలా తీశారో ఈ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, వీడియోలను ఇందులో జతచేశారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి, సునీల్, ప్రకాశ్ రాజ్ అందరూ సెట్లో సరదాగా ఉన్న క్లిప్పింగ్స్ మేకింగ్ వీడియోలో ఉన్నాయి.

త్రివిక్రమ్ యాక్షన్ చెప్పడంతో మొదలయ్యే మేకింగ్ వీడియో కట్ చెప్పడంతో ముగుస్తుంది. 2024 సంక్రాంతికి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న అతి పెద్ద సినిమా గుంటూరు కారం. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట షోలతోనే ఈ సినిమా హల్చల్ చేయబోతుంది. తెలంగాణలో అర్ధరాత్రి ఒకటి, తెల్లవారుఝామున 4 గంటల షోలకు అనుమతి ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం మూవీ టికెట్ల ధరలు కూడా పెరిగాయి. ఏపీలో రూ.50 మేర టికెట్ ధర పెంచడానికి అనుమతి ఇచ్చారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంచారు.

సంక్రాంతి పండుగను మహేష్ ఫ్యాన్స్ గుంటూరు కారంతోనే మొదలు పెట్టబోతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ హడావిడి మొదలైంది. గుంటూరులో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రూ.125 కోట్లుగా ఉంది.
https://www.instagram.com/reel/C18tEPloQXN/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu