టాలీవుడ్‌లో ఈ ఏడాది పలు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. వాటిలో చివరి నిమిషంలో రవితేజ ఈగల్ మూవీ రేసు నుండి తప్పుకుంది. దీంతో మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ జనవరి 12న ప్రేక్షకుల ముందు వచ్చాయి.
భారీ అంచనాల మధ్య విడుదలన గుంటూరు కారం సినిమా ఈ పండుగకు పర్ఫెక్టర్ మూవీ అనే చెప్పాలి. మహేష్ బాబు మాస్- విటెంజ్ లుక్‌లో కనిపించిన ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఆ అంచనాలను అందుకుంటూ.. ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చింది ఈ సినిమా.
మాస్ సాంగ్స్, ఇద్దరు హీరోయిన్స్, ఎమోషన్స్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు హై-వోల్టేజ్ యాక్షన్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి శ్రీలీల గ్లామర్ మరియు మెస్మరైజింగ్ డ్యాన్స్ , నటనతో పాటు మహేష్ బాబు యాక్షన్ హైలైట్‌గా నిలిచాయి. ఇంకా “కుర్చీ మడతపెట్టి” ఈ సినిమాలో మరో హైలైట్ అని చెప్పాలి. ఈ సాంగ్‌లో శ్రీలీల, మహేష్ డ్యాన్స్ ప్రేక్షకులను సీటుల్లో కూర్చోనివ్వదు .
శ్రీలీల డ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఆమె డ్యాన్స్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింది. త్రివిక్రమ్ సిగ్నేచర్ డైలాగులు, మీనాక్షి గెస్ట్ రోల్- రమ్య కృష్ణ ఎమోషనల్ రోల్ అన్నీ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి బొనాంజాలా ఉంది.
కాగా యానిమల్- సాలార్ వంటి బ్లాక్‌బస్టర్‌లు అయినప్పటికి ఈ రెండు ఈ సినిమాలు యాక్షన్ -వైలెంట్‌ని మాత్రమే ప్రాధనంగా తెరకెక్కాయి. గుంటూరు కారం సినిమా మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. ఈ సంవత్సరం సంక్రాంతి ఈ సినిమా గుర్తిండిపోయే సినిమా.
.