HomeTelugu Big Stories'గుంటూరు కారం' ఫస్ట్‌ రివ్యూ

‘గుంటూరు కారం’ ఫస్ట్‌ రివ్యూ

guntur kaaram first review 1
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్‌ వాటెండ్‌ బ్యూటీ శ్రీలీల హీరోగా నటించింది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌.. ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ హైప్‌ని క్రియేట్‌ చేశాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

గుంటూరు కారం సినిమాకు ప్రమోషన్స్ కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక గుంటూరు కారం సినిమా ఇటీవలే సెన్సార్ టాక్ పూర్తి చేసుకుంది. గుంటూరు కారం సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అలాగే సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తయిందని తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమా రన్ టైమ్ 2 గంటల 39 నిమిషాలు ఉందని తెలిసింది. వాటిలో ఫస్టాఫ్ 85 నిమిషాలు, సెకండాఫ్ 74 నిమిషాల (మొత్తంగా 159 నిమిషాలు) నిడివితో ఉంటుందట. అయితే, గుంటూరు కారం మూవీలోని కొన్ని డైలాగ్స్‌కు మాత్రం మ్యూట్ చేసినట్లు సమాచారం. గుంటూరు కారం సినిమా ప్రింట్స్ ఇప్పటికే ఓవర్సీస్‌కు డెలీవరి అయ్యాట.

అలాగే దుబాయ్‌లో కూడా గుంటూరు కారం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ రానే వచ్చింది. మూవీ క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకునే ఉమర్ సంధు గుంటూరు కారం మూవీపై రివ్యూ ఇచ్చాడు.

గుంటూరు కారం రివ్యూను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఉమర్ సంధు. అందులో.. “ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ నుంచి గుంటూరు కారం మూవీ ఫస్ట్ రివ్యూ. మహేశ్ బాబుతోపాటు ఎంటర్టైన్‌మెంట్ అధిక మోతాదులో ఉంది. సినిమాలో మాస్ ప్రేక్షకులకు కావాల్సిన మసాలా ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

అవి మాస్ పీపుల్‌కు బాగా వర్కౌట్ అవుతాయి. రూల్స్ తిరగరాసే సినిమా అవుతుంది. సినిమాకు పండుగ సీజన్ మరింత కలిసి వస్తుంది. సూపర్ హిట్” అని చెప్పిన ఉమర్ సంధు 5కి 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu