రుధ్రమదేవి చిత్రంతో ఫామ్ లోకి వచ్చిన గుణశేఖర్ తన తదుపరి చిత్రంగా రుధ్రమదేవి సినిమాకు సీక్వెల్ గా ‘ప్రతాపరుద్రుడు’ చిత్రాన్ని రూపొందిస్తానని ఓ సంధర్భంలో చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కంటే ముందుగా హిరణ్యకశిపుడి ఇతివృత్తాన్ని ప్రధానంగా తీసుకొని ఓ పౌరాణిక చిత్రాన్ని రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు హిరణ్యకశిప అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు.
ఆయన ఈ సినిమా చేస్తున్నాడని తెలిసినప్పటి నుండి హిరణ్యకశిపుడి పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి అందరిలో కలిగింది. పౌరాణిక చిత్రాల్లో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ అయితే పెర్ఫెక్ట్ అని గుణశేఖర్ భావన. హిరణ్యకశిపుడిగా ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేయగలడని గుణశేఖర్ కొందరు సన్నిహితులతో చెబుతున్నారు. మరి గుణశేఖర్ ఆ దిశగా సంప్రదింపులు చేస్తే ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాడా..? అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఎన్టీఆర్ రెండు వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. ఈ నేపధ్యంలో గుణశేఖర్ కు కావల్సిన బల్క్ డేట్స్ ను కేటాయించగలరో.. లేదో.. చూడాలి!