ప్రతిభావంతులైన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన ఆయన ఒకానొక దశలో డీలా పడిపోయారు. చాలా కాలం గ్యాప్ తరువాత ‘రుద్రమదేవి’ చిత్రంతో హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ఆయన దీనికి సీక్వెల్ గా ‘ప్రతాపరుద్రుడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తానని అన్నారు. అయితే దానికంటే ముందుగా మరో సినిమా చేయాలనుకుంటున్నారు.
‘భక్తప్రహ్లాద’ చరిత్ర ఆధారంగా సినిమా చేయడానికి సిద్ధపడుతున్నాడు. తిరుమల దేవస్థానానికి కుటుంబసమేతంగా హాజరైన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టే ముందు దేవుడిని దర్శించడం తనకు అలవాటని అన్నారు. త్వరలోనే సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తానని తెలిపారు. ప్రస్తుతానికి నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ప్రీప్రొడక్షన్ వర్క్ కు ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. బహుశా వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కే
అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ఈ సినిమా కూడా ‘గుణటీం వర్క్స్’ బ్యానర్ లో నిర్మించనున్నారు.