‘RX 100’ హీరో కార్తికేయ నటించిన సినిమా ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. అనగ హీరోయిన్. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోషల్‌మీడియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఓ మొబైల్ షాపులో హీరోయిన్ అనగ సేల్స్ గర్ల్‌గా వ్యవహరించారు. కార్తికేయ ఆమె వద్ద ఫోన్ కొనడానికి వెళ్తారు. ఆ సమయంలో గంగవ్వ షాపులోకి వెళ్లి రచ్చ చేసేశారు. కార్తికేయ.. హీరోయిన్‌ను ఫొటో తీస్తుంటే గంగవ్వ చూసి.. ‘ఏయ్.. పిల్ల ఫొటోలు తీస్తున్నావా? ఆడపిల్లలు కనిపిస్తే మాటలు కలిపి ముచ్చట్లు పెడుతుంటారు’ అని కార్తికేయను తిట్టడం ఫన్నీగా ఉంది. ‘గుణ’కు గంగవ్వ ఎలా చుక్కలు చూపించారో మీరూ చూడండి..