HomeOTTUnstoppable: సీనియర్ హీరోలతో చిట్ చాట్ పెట్టనున్న బాలకృష్ణ

Unstoppable: సీనియర్ హీరోలతో చిట్ చాట్ పెట్టనున్న బాలకృష్ణ

Interesting guest list for Balakrishna Unstoppable
Interesting guest list for Balakrishna Unstoppable

Unstoppable Season 4 Guest List:

నందమూరి బాలకృష్ణ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఆయన చేసే మాస్ సినిమాలు.. లేదా బయట అప్పుడప్పుడు కనిపించి ఆయన గంభీరమైన మొహం. కానీ సినిమాలలో కాకుండా బయట కూడా బాలకృష్ణలో ఒక ఎంటర్టైనింగ్ యాంగిల్ ఉంది అనే విషయాన్ని అందరికీ తెలిసేలా చేసింది అన్ స్టాపబుల్ షో. సెలబ్రిటీ టాక్ షో గా విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగవ సీజన్ కి సిద్ధం అవుతుంది.

అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కోసం బాలకృష్ణ అభిమానులతో పాటు మిగతావారు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సీజన్లో బాలకృష్ణ ఎవరిని అతిథులుగా ఆహ్వానించనున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలా అనుబంధం చాలా ఏళ్ల నాటిది. వాళ్ళిద్దరూ ఒకే వేదిక మీద కనిపిస్తే ఉండే ఎంటర్టైన్మెంట్ వేరు. అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ముందు సీజన్లో అల్లు అరవింద్ వచ్చారు కానీ.. చిరంజీవి మాత్రం కనిపించలేదు.

ఇక ఈసారి ఎలాగైనా చిరంజీవి వస్తే బాగుంటుంది అని అభిమానులు ఎప్పటినుంచో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా వాళ్ళందరి కోసం ఒక గుడ్ న్యూస్ రాబోతోంది అని తెలుస్తోంది. అన్ స్టాపుల్ మొదటి ఎపిసోడ్ కి ముఖ్యఅతిథిగా విచ్చయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. వీళ్ళిద్దరినీ ఒకే వేదిక మీద చూడడానికి ఫాన్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారు. మరి ఈ వీళ్ళ కాంబోలో ఎపిసోడ్ ఎంత ఫన్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటుందో వేచి చూడాలి.

మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున కూడా ఈ సీజన్ కి గెస్ట్ గా రాబోతున్నారు అని తెలుస్తోంది. వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి స్నేహబంధం ఉంది. వీళ్ళిద్దరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో అని కూడా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu