
Arjun Sarja Childhood Dream:
సినిమాల్లో హీరోగా కనిపించే Arjun Sarja అసలైన జీవితంలో మాత్రం ఒక భిన్నమైన కలతో ముందుకు వెళ్లారు. యాక్షన్ కింగ్ గా పిలిపించుకునే ఈ అర్జున్ అసలు ఆర్మీ ఆఫీసర్ కావాలనుకున్నారు. కానీ అది జరగలేదు.
అర్జున్ చిన్నప్పటి నుంచి దేశభక్తితో పెరిగారు. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్మీ ఆఫీసర్ కావాలని నిర్ణయించుకున్నారు. అన్ని ప్రొసీజర్స్ పూర్తయ్యాక చివరగా తన తల్లి సంతకం పెట్టించుకోవాల్సి వచ్చింది. కానీ ఆర్మీలో చేరిన వ్యక్తి ప్రాణానికి హామీ ఇవ్వలేమని ఆ ఫామ్‌లో రాయడం చూసిన తల్లి భయపడి, కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి బాధను చూసి, ఆమె కోసమే తన కలను వదిలేసుకున్నారు.
ఆర్మీలో చేరలేకపోయినా, అర్జున్ ఆ కోరికను సినిమాల ద్వారా తీర్చుకున్నారు. తన సినిమాల్లో పోలీస్, ఆర్మీ ఆఫీసర్ పాత్రలు చేస్తూ రీల్ లైఫ్‌లో దేశ సేవ చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు, దేశానికి ఉన్న గౌరవంతో తన చేతిపై జాతీయ జెండాను టాటూ కూడా చేయించుకున్నారు.
ఇప్పుడు విలన్ పాత్రల్లో కూడా అర్జున్ బిజీగా ఉన్నారు. తాజాగా అజిత్ నటించిన ‘విదాముయార్చి’ (Vidamuyarchi) సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించారు. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ సినిమా అర్జున్ కెరీర్‌కు మరో హిట్ ఇవ్వబోతోందని అభిమానులు ఆశిస్తున్నారు.
ALSO READ: Ajith Pattudala కేవలం టైటిల్ వరకే అయితే కలెక్షన్స్ ఎలా?