Allu Arjun Ala Vaikunthapurramuloo Movie:
స్టైలిష్ స్టార్ Allu Arjun పుష్ప: ది రైజ్ తో దేశవ్యాప్తంగా పాన్-ఇండియా స్టార్‌గా మారారు. పుష్ప రాజ్ పాత్రలో ఆయన చేసిన అద్భుతమైన నటన, “తగ్గేదేలే” డైలాగ్ ఆయన అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు అందరి దృష్టి “పుష్ప 2: ది రూల్”పై ఉంది, ఈ సినిమా 2024 డిసెంబర్ 6న విడుదల కానుంది.
కానీ, “పుష్ప సినిమా కంటే ముందు అల్లు అర్జున్ 2020లో విడుదలైన “అల వైకుంఠపురములో సినిమాతో కూడా భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో కథ, నటనలతో పాటు ఒక ప్రత్యేకత ఏమిటంటే, సినిమా అంతా చూపించిన ఆ భారీ బంగ్లా.
“అల వైకుంఠపురములో” సినిమాలో చూపించిన ఆ అద్భుతమైన ఇంటిని అసలు ఇంటి సెట్టింగ్ అని అనుకోలేరు. ఇది నిజంగా హైదరాబాద్‌లో ఉన్న విలాసవంతమైన బంగ్లా. ఈ బంగ్లా ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచనా చౌదరి, ఆమె భర్తకి చెందినది. ఈ బంగ్లా విలువ అక్షరాలా రూ. 300 కోట్లు.
ఈ బంగ్లాలో టబు, జయరాం పాత్రలకు సంబంధించిన కుటుంబం జీవిస్తున్నట్లు చూపించారు. ఈ బంగ్లా సినిమాకి ఒక ప్రత్యేకమైన విశ్యువల్ రిచ్‌నెస్‌ను తెచ్చింది. సినిమాలో చాలానే ముఖ్యమైన సీన్లు, పాటలు ఈ బంగ్లాలోనే చిత్రీకరించారు.
అల్లు అర్జున్ కూడా ఈ బంగ్లాను చూసి ఆశ్చర్యపోయాడని, భవిష్యత్తులో ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని తన a అభిప్రాయం వ్యక్తం చేశాడని కొందరు చెబుతున్నారు
Read More: Amitabh Bachchan జల్సా ఇంటి ధర తెలుసా? ఆయన కారు కలెక్షన్ చూస్తే నోరు తెరవాల్సిందే!