India’s Most Expensive Car:
భారతీయ బిలియనీర్ యోహాన్ పూనావాల్లా తన కార్ల ప్రేమను మరోసారి చాటుకున్నారు. రూ. 22 కోట్ల విలువైన Rolls Royce Phantom VIII Extended Wheelbase (EWB) కారు ఇప్పుడు ఇండియాలో అత్యంత ఖరీదైన కారుగా నిలిచింది.
ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే, దీనికి Bohemian Red కలర్ పూత ఇచ్చారు. ఇక ముందుభాగంలో సాలిడ్ గోల్డ్ Spirit of Ecstasy హుడ్ ఆర్నమెంట్ ఉంది. పూనావాల్లా ఫ్యామిలీని ప్రతిబింబించేలా కస్టమ్-పెయింటెడ్ “P” ఇన్సిగ్నియా కూడా ఉంది.
ఇది మాత్రమే కాదు, ప్రైవసీ సూట్ అనే అత్యంత అరుదైన ఫీచర్ ఈ కారులో ఉంది. రోల్స్ రాయిస్ ఈ ఫీచర్‌ను ఆపేసినా, పూనావాల్లా స్పెషల్‌గా రిక్వెస్ట్ చేసి దీనిని పొందారు. ఈ ఫీచర్ డ్రైవర్ వెనుక కూర్చునే ప్రయాణికుల మధ్యకి పార్టిషన్‌ను ఏర్పాటు చేస్తుంది.
యోహాన్ పూనావాల్లా వద్ద ఇప్పటికే 22 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
Rolls Royce Spectre Electric Coupe – భారత్‌లో మొదటి ఎలక్ట్రిక్ రోల్స్ రాయిస్
Phantom VII EWB – నీలం, నలుపు కలర్‌లో
Phantom Drophead Convertibles – తెలుపు, నలుపు రంగుల్లో
పూనావాల్లా వద్ద దక్షిణ ముంబైలో 30,000 స్క్వేర్-ఫీట్ విలాసవంతమైన భవనం కూడా ఉంది, దీని విలువ రూ. 400-750 కోట్లు. అతని తాజా రోల్స్ రాయిస్ కొనుగోలు నీతా అంబానీ రూ. 12 కోట్ల రోల్స్ రాయిస్ కారును దాటి పోయింది. లగ్జరీలో పూనావాల్లా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అన్నమాట.
ALSO READ: Sandeep Vanga వివాదాస్పద సన్నివేశం గురించి క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!