Telugu Politicians following on Twitter:
ఈ డిజిటల్ యుగంలో.. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ రాజకీయ పార్టీలకు సామాజిక మాధ్యమాల్లో మాంచి ఫాలోయింగ్ ఉండటం అవసరం. దీని ప్రకారం, మన రాజకీయ నేతలు సోషల్ మీడియాలో పెద్దమొత్తంలో అభిమానులను సంపాదించారు. ఇప్పుడు, ట్విట్టర్‌లో అత్యధిక మంది అనుచరులను ఉన్న ప్రముఖ తెలుగు రాజకీయ నాయకుల గురించి తెలుసుకుందాం.
- పవన్ కల్యాణ్:
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 5.8 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్లతో ముందంజలో ఉన్నారు. ఆయనకి సినిమాల ద్వారా వచ్చిన విపరీతమైన క్రేజ్.. రాజకీయాల్లో తన ప్రస్థానంతో ఆయన ఈ జాబితాలో టాప్ లో ఉన్నారు.
- చంద్రబాబు నాయుడు:
తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యంత కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 5.2 మిలియన్ల అనుచరులతో రెండో స్థానంలో ఉన్నారు. ఒకానొక సమయంలో, పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు మాత్రం చంద్రబాబు ట్విట్టర్‌లో అత్యధిక అనుచరులు ఉన్న పొలిటీషియన్ గానే ఉన్నారు.
- కేటీఆర్:
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పది సంవత్సరాల పాలనలో, కేటీఆర్ సోషల్ మీడియాలో మాత్రమే కాక ప్రజల్లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఆయన ప్రజలతో నేరుగా సోషల్ మీడియాలో స్పందించి, సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ట్విట్టర్‌లో విపరీతమైన ఆదరణ అందుకున్నారు. కేటీఆర్ కి 4.5 మిలియన్ల అనుచరులు ఉన్నారు.
- జగన్మోహన్ రెడ్డి:
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ట్విట్టర్‌లో పెద్దగా పోస్ట్ లు కూడా చేసేవారు కాదు. అప్పుడప్పుడు మాత్రమే ఆయన ట్వీట్లు బయటకు వచ్చేవి. కానీ, అతి దారుణంగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాత్రం.. ఇప్పుడు మరింత చురుకుగా ట్వీట్లు చేస్తున్నారు. ఆయనకి 2.8 మిలియన్ల ట్విట్టర్ అనుచరులు ఉన్నారు.
- నారా లోకేష్:
తెలుగుదేశం పార్టీ వారసుడు, మంగళగిరి క్యాబినెట్ మినిస్టర్ నారా లోకేష్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు చురుకుగా ఉంటారు. ఆయన దాదాపు 1 మిలియన్ అనుచరులతో ఐదవ స్థానంలో ఉన్నారు. సామాన్యుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి కూడా ఆయన సోషల్ మీడియా వేదికను ఉపయోగిస్తూ ఉంటారు.
- రేవంత్ రెడ్డి:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో బాగానే ముందుకు సాగుతున్నారు. కానీ, సోషల్ మీడియాలో ఆయనకు ప్రస్తుతం 574K మంది అనుచరులు మాత్రమే ఉన్నారు. కానీ తెలంగాణ సిఎం కాబట్టి ఆయన ఫాలోవర్స్ కూడా పెరుగుతూనే ఉన్నారు.
Read More: Tirumala Laddu Controversy: అసలు ఏం జరిగింది? దీని వెనుక ఎవరి హస్తం ఉంది?