Most Expensive Villain 2024:
భారతీయ సినిమా ఎప్పటి నుంచో విలన్లకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మధ్య హీరోలు కూడా విలన్లుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు యష్ వంటి స్టార్ విలన్లు కథలో కొత్త రంగులు జోడిస్తున్నారు.
యష్ ఇప్పుడు భారతీయ సినిమాల్లో అత్యధిక పారితోషికం పొందిన విలన్.
కన్నడ సూపర్ స్టార్ యష్, తన కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తను రామాయణంలో రావణుడి పాత్రకు రూ. 200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఇది భారతీయ సినిమాల్లో ఒక విలన్‌కు ఇచ్చిన అత్యధిక రెమ్యూనరేషన్ కావడం విశేషం.
View this post on Instagram
ఈ మొత్తం యష్ యాక్టింగ్ కోసం మాత్రమే కాక సినిమా డిస్ట్రిబ్యూషన్ వసూళ్లలోని వాటాను కూడా కలుపుకుని ఉంది. యష్ ఈ సినిమాకు సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. దాదాపు రూ. 835 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు.
ఈ భారీ బడ్జెట్ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పుడు కథానాయకుల కంటే విలన్లకు చిన్న పాత్రలు ఉండేవి. కానీ ఇప్పుడు విలన్లకు కూడా కథలో సమాన ప్రాధాన్యం వస్తోంది. యష్ రావణుడి పాత్రతో ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షిస్తారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.