
Vijay Deverakonda Kingdom:
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కింగ్డమ్ టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ మునుపెన్నడూ చూడని ఫియర్ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది, ఇంకా చాలా ఆసక్తికరమైన వివరాలు బయటకు రావాల్సి ఉంది.
ఇప్పుడైతే మరో క్రేజీ అప్‌డేట్ బయటకి వచ్చింది. సత్యదేవ్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అన్నగా నటిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటి వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, కథలో భారీ ట్విస్ట్ తీసుకువస్తుందని టాక్. సత్యదేవ్ ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటాడు కాబట్టి ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
ఇక కథానాయిక విషయానికి వస్తే, భవ్యశ్రీ బోర్స్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఇది ఆమెకు చాలా పెద్ద బ్రేక్ అవుతుందని అంచనా. మరోవైపు, సంగీత దర్శకుడిగా అనిరుధ్ పనిచేస్తున్నాడు. అనిరుధ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌లు అందించాడు కాబట్టి, కింగ్డమ్ కి అదిరిపోయే మ్యూజిక్ సెట్ చేయడం ఖాయం.
ఈ చిత్రాన్ని నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. వీరిద్దరూ హిట్ సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్లు కావడంతో, కింగ్డమ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ చూసినట్టు అయితే సినిమా స్టోరీ, విజయ్ పాత్ర కొత్తగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక సత్యదేవ్ పాత్ర రివీల్ అయితే సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి.
ALSO READ: Vishwak Sen ఇంట్లో దొంగతనం.. భారీ నగదు మాయం.. ఏమేం పోయాయంటే..