Pushpa 2 promotions:
పుష్ప ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని స్వయంగా చిత్ర బృందం సినిమా ట్రైలర్ ద్వారా తెలియజేసింది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మరొక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు, ‘పుష్ప 2: ది రూల్’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
సినిమా విడుదలకు ముందే వెయ్యి కోట్ల మార్కెట్ సాధించిందని సమాచారం. ఇప్పుడు మిగిలింది విడుదల మాత్రమే. కానీ అంతకు ముందు, ప్రమోషన్లు కూడా అంతకంటే పెద్ద స్థాయిలో ఉంటాయని చెప్పాలి. భారతీయ సినిమాల్లో ఎప్పుడూ చూడని రీతిలో, రూపాయల 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
ఈ భారీ మొత్తాన్ని మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే ఖర్చు చేయడం లేదు. దేశవ్యాప్తంగా పలు కార్పొరేట్ సంస్థలు ఈ ప్రచారానికి తమ వాటా అందిస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ టీమ్ విడుదల చేసిన వీడియోలో, పుష్ప 2కు భారీ స్థాయిలో బ్రాండ్ భాగస్వామ్యాలు ఉన్నట్లు వెల్లడించారు.
ప్రముఖ బ్రాండ్లు ప్రతి ఒక్కటి రూ. 10 నుంచి రూ. 20 కోట్ల వరకు తమవంతు సహకారం అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా టీవీ ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, హోర్డింగ్స్‌పై ప్రచార కార్యక్రమాలు దూసుకుపోతాయి. పుష్ప 2 సినిమా విడుదలైతే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.