
Noisiest Neighborhood in Hyderabad:
ఒకప్పుడు గచ్చిబౌలి అంటే నగరానికి అంచున ప్రశాంతంగా ఉండే ప్రాంతం. కానీ ఇప్పుడు అది హైదరాబాద్‌లో అతి శబ్దభరితమైన ప్రాంతంగా మారింది. అభిడ్స్, సనత్‌నగర్ లాంటి వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల కంటే కూడా ఇక్కడి శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంది.
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPB) లెక్కల ప్రకారం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిసరాల్లో శబ్ద స్థాయిలు అనుమతించిన పరిమితిని మించిపోయాయి. గచ్చిబౌలిలోని ప్రధాన రహదారి అయిన ముంబై ఓల్డ్ హైవే వద్ద ట్రాఫిక్ పెరగడం, భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కావడంతో ఈ ప్రాంతం అతి శబ్దభరితమైనదిగా మారింది.
ప్రస్తుతం, నగరంలోని కొన్ని ప్రాంతాలను “సెన్సిటివ్ జోన్స్”గా గుర్తించారు. ఇక్కడ నిబంధనల ప్రకారం, పగలు 50 డెసిబెల్స్ (dB), రాత్రి 40 dB మాత్రమే ఉండాలి. కానీ గచ్చిబౌలిలో శబ్ద స్థాయిలు భయంకరంగా పెరిగాయి. ఫిబ్రవరి మొదటి 10 రోజుల్లో రికార్డ్ అయిన గరిష్ట శబ్ద స్థాయి 73.53 dB. రాత్రివేళల్లో కూడా 69 dB – 70 dB మధ్యే కొనసాగుతోంది. ఫిబ్రవరి 3న గచ్చిబౌలిలో శబ్దం 73.53 dB చేరింది. అదే సమయంలో, అభిడ్స్ 56.05 dB, జూబ్లీ హిల్స్ 58.66 dB, నెహ్రూ జూలాజికల్ పార్క్ 65-67 dB రికార్డ్ అయ్యాయి.
ఈ పరిణామం గచ్చిబౌలి, కొండాపూర్, మాధాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నల్లగండ్ల, టెల్లాపూర్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాత్రివేళల ఆరామంగా నిద్రపోవాలంటే శబ్ద కాలుష్యాన్ని తగ్గించే చర్యలు అవసరం.
ALSO READ: Chiranjeevi రెమ్యూనరేషన్ విషయంలో కంగారు పడుతున్న నిర్మాతలు