HomeTelugu Trendingప్రపంచవ్యాప్తంగా Most Downloaded App గా పేరు తెచ్చుకున్న యాప్ ఏదంటే

ప్రపంచవ్యాప్తంగా Most Downloaded App గా పేరు తెచ్చుకున్న యాప్ ఏదంటే

Guess which is the most downloaded app in the world
Guess which is the most downloaded app in the world

World’s Most Downloaded App:

మార్చి నెలలో ఒక సెన్సేషన్‌ సృష్టించిన యాప్‌ అంటే అది ChatGPT! గతంలో ఎప్పుడూ టాప్‌లో ఉండే Instagram, TikTok‌లను దాటేసి, ప్రపంచవ్యాప్తంగా non-gaming apps లో అత్యధిక డౌన్లోడ్‌లు పొందిన యాప్‌గా నిలిచింది. Appfigures అనే సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం, ChatGPT మార్చిలో ఏకంగా 46 మిలియన్ల కొత్త డౌన్లోడ్‌లు కొట్టింది. ఇది ఫిబ్రవరిలో కంటే 28% ఎక్కువ అని చెప్పొచ్చు!

ఈ స్పైక్‌కి కారణం మార్చి లో వచ్చిన పెద్దపెద్ద updates. ముఖ్యంగా image generation ఫీచర్‌కి వచ్చిన మెరుగుదలతో, Studio Ghibli style images, memes మొదలైనవి వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, voice feature కూడా బాగుపరిచారు. కొన్ని image content పరిమితులు కూడా తేలికపరిచారు.

అయితే, Appfigures CEO చెబుతున్నట్లు, ఈ పెరుగుదల వెనక ఉన్నది ఒక్క upgrades కాదు. ChatGPT బ్రాండ్‌ ఇప్పుడు “AI లో Google” లా మారిపోయింది. అంటే, AIని ఉపయోగించాలంటే ముందుగా గుర్తొచ్చేది ChatGPTనే! Grok, Claude, DeepSeek వంటివి ఉన్నా – చాలా మంది ముందుగా ChatGPT ట్రై చేస్తారు.

ఇతర యాప్స్‌ విషయానికొస్తే – Instagram రెండోస్థానంలోకి జారిపోయింది, TikTok మూడోస్థానంలో ఉంది. Facebook, WhatsApp నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచాయి. CapCut, Telegram, Threads, Temu లాంటి యాప్స్‌ కూడా టాప్ 10లో ఉన్నాయ్.

మొత్తంగా మార్చి నెలలో టాప్ 10 యాప్స్‌ కలిపి 339 మిలియన్ల డౌన్లోడ్‌లు సంపాదించాయి. ఫిబ్రవరిలో ఇది 299 మిలియన్లే. ఇది చూస్తే, ChatGPT హవా ఇంకొంత కాలం కొనసాగేలా ఉంది!

Recent Articles English

Gallery

Recent Articles Telugu