PV Sindhu Hyderabad Home:
భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, డిసెంబర్ 22, 2024న హైదరాబాదు వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఉదయ్‌పూర్‌లో జరిగే ఈ వివాహ వేడుకకు డిసెంబర్ 20 నుంచి ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు ప్రారంభమవుతాయి.
డిసెంబర్ 24న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్‌తో వేడుకలు ముగుస్తాయి. పీవీ సింధు హైదరాబాద్లో ఆడంబర గృహం
సింధు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న తన విలాసవంతమైన గృహంలో నివసిస్తున్నారు. ఈ మూడు అంతస్తుల గృహాన్ని సౌకర్యవంతమైన జీవనానికి అనుగుణంగా డిజైన్ చేయించారు.
మొదటి రెండు అంతస్తులు కుటుంబ సభ్యుల అవసరాలకు తగిన రీతిలో ఉండగా, మూడవ అంతస్తులో హోమ్ థియేటర్, అందమైన టెర్రస్ గార్డెన్ ఉన్నాయి. సింధు తరచుగా తన ఇల్లులోని ప్రత్యేకతలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటారు.
ఈ ఇంట్లో అత్యంత విశేషమైన భాగం అవార్డుల గది. ఈ గదిలోనే తను సాధించిన పతకాలు, ట్రోఫీలను దాచుకుంటుంది సింధు. ఇది ఆమె కష్టానికి, విజయానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.
సింధు వద్ద బోలెడు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అవేంటంటే..
*BMW X5
*BMW 320D
*మహీంద్రా థార్
సింధు టాప్ బ్రాండ్లతో ఎండార్స్‌మెంట్‌లు కూడా చేస్తుంటారు. లీ నింగ్, మేబెలిన్, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీలతో పనిచేస్తున్నారు. ఆమె రూ. 59 కోట్ల నికర ఆస్తితో భారతదేశంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ పొందే మహిళా అథ్లెట్‌గా నిలిచారు.
పీవీ సింధు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా, అభిమానులు ఆమె గురించి మరింత తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు.
ALSO READ: Naga Chaitanya నెట్ వర్త్ ఎంతో తెలుసా?