2024 Best Telugu Song:
2024 ముగింపుకి దగ్గరపడుతోంది. మరో వారం రోజుల్లో 2025లోకి అడుగుపెడతాం. ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని ప్రముఖ మ్యూజిక్ ఆల్బమ్‌లపై ఒకసారి చూద్దాం. ముఖ్యంగా స్టార్ హీరోల ఆల్బమ్‌లను మాత్రమే పరిశీలిద్దాం.
గుంటూరు కారం ఆల్బమ్‌తో ఈ సంవత్సరం మొదలైంది. తొలుత ఈ ఆల్బమ్ మిక్స్డ్ రివ్యూలను అందుకున్నా, ఆ తరువాత ఓటీటీ విడుదల తర్వాత సెన్సేషన్‌గా మారింది. మావా ఎంతైనా, కూర్చి మడతపెట్టీ పాటలు పెద్ద హిట్ అయ్యాయి.
కల్కి తర్వాతి పాన్ ఇండియా చిత్రం అయినప్పటికీ, ఈ ఆల్బమ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. థీమ్ ఆఫ్ కల్కి పాట మాత్రం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వైరల్ అయ్యింది కానీ ప్లేలిస్టుల్లో చోటు సంపాదించలేకపోయింది.
View this post on Instagram
దేవరలో అనిరుధ్ సంగీతం అందించాడు. చుట్టమల్లే, ఫియర్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయుధ పూజ కూడా కొన్ని రోజులు చార్ట్‌లను డామినేట్ చేసింది.
ఇక పుష్ప 2 ఆల్బమ్ కూడా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. మొదటి భాగం పాటలు ఎంత వైరల్ అయ్యాయో రెండవ భాగం పాటలు మాత్రం ప్రజాదరణ పొందలేకపోయాయి. సూసేకి పాట డీసెంట్ వ్యాల్యూను సంపాదించగా, పీలింగ్స్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పించింది.
View this post on Instagram
ఇదంతా చూసిన తర్వాత, ఈ ఏడాదిలో అత్యుత్తమ పాటల పోటీ చుట్టమల్లే, మావా ఎంతైనా, కూర్చి మడతపెట్టీ, సూసేకి మధ్యనే ఉంది. సోషల్ మీడియా స్పందన చూస్తే చుట్టమల్లే లేదా మావా ఎంతైనా పాటలు బెస్ట్ గా నిలిచే అవకాశం ఉంది.
View this post on Instagram
ALSO READ: పోలీస్ ఇన్వెస్టిగేషన్ సమయంలో Allu Arjun కన్నీళ్లు పెట్టుకున్నారా?