
Sikandar Trade Predictions:
సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్’ సినిమా మార్చి 30న విడుదల కాబోతోంది. సాధారణంగా శుక్రవారం (మార్చి 28) సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీ. కానీ మేకర్స్ ఆదివారం రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే మంచి స్ట్రాటజీనా లేక సినిమాపై గమ్మత్తుగా డౌటా?
ఇప్పటి వరకూ, ట్రేడ్ అనలిస్ట్‌లు ‘సికందర్’ ఓపెనింగ్ రోజు 25 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. కానీ ఆదివారం విడుదల కావడంతో అది 35 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. మరుసటి రోజు ఈద్ సెలబ్రేషన్ ఉండటంతో, రెండో రోజు కలెక్షన్లు 45-50 కోట్ల వరకు వెళ్లొచ్చు.
కానీ, ఇది సరిపోతుందా? షారుఖ్ ఖాన్ గతంలో పఠాన్ (55 కోట్లు, నాన్ హాలిడే) & జవాన్ (65 కోట్లు, సెమీ హాలిడే) తో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. అలా చూస్తే, సికందర్ కనీసం 50 కోట్లు మొదటి రోజు సాధించాలి. లేదంటే, సల్మాన్ ఖాన్ క్రేజ్ తగ్గిందనే మాటలు వినిపించొచ్చు.
సల్మాన్ గత కొన్ని సినిమాలు వెరైటీ కథలతో ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఫ్లాప్‌లు ఎదుర్కొన్నారు. అంతేకాదు, ‘సికందర్’ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కూడా గత కొన్ని ఏళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి, ఈ ఇద్దరి కాంబినేషన్ హిట్ కొడుతుందా? సికందర్ ట్రైలర్ & వర్డ్ ఆఫ్ మౌత్ డిసైడ్ చేయనుంది.
ఈ సినిమా టైగర్ 3 (45 కోట్లు) ఓపెనింగ్ రికార్డ్‌ను దాటుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ట్రేడ్ అనలిస్ట్‌ల ప్రకారం, సికందర్ 35 కోట్లు ఓపెన్ అవుతుందని, కానీ ట్రైలర్ సూపర్ హిట్ అయితే 45+ కోట్లు సాధించే ఛాన్స్ ఉంది.
ఈద్‌కు సల్మాన్ సినిమాలు పక్కా బ్లాక్‌బస్టర్ అనే పేరు ఉంది. కానీ ఈ సారి పరిస్థితి కొత్తగా ఉంది. మూవీ ఓపెనింగ్ 40+ కోట్లు దాటితే మాత్రమే సల్మాన్ స్టార్డమ్ ఇంకా బలంగా ఉందని ప్రూవ్ అవుతుంది. మరి, సికందర్ గేమ్ మార్చుతుందా? మార్చి 30న అసలు సంగతేంటో తెలుస్తుంది!
ALSO READ: Ghajini లో కల్పన మరణానికి అసలైన కారణం అదే అంటున్న AR Murugadoss