
Priyanka Chopra Bulgari necklace:
బాలీవుడ్ స్టార్ Priyanka Chopra ప్రస్తుతం తన తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి వేడుకల కోసం ఇండియాలో ఉన్నారు. ఎప్పుడూ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచే ప్రియాంక, ఈ వేడుకల్లోనూ అదిరిపోయే లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
సంగీత్ ఫంక్షన్‌లో ప్రియాంక ధరించిన బుల్గారి నెక్లెస్ అందరికీ ఆకర్షణగా మారింది. ఈ పింక్ గోల్డ్ నెక్లెస్‌లో చిన్న వజ్రాలతో పాటు 7 పెయిర్ ఆకారపు మోర్గనైట్స్, 9 క్యాబోచాన్ అమెథిస్ట్ రాళ్లు, 6 కుషన్ మందారిన్ గార్నెట్స్ ఉన్నాయి. దీని విలువ ఏకంగా రూ. 12 కోట్లు!
ఆ నెక్లెస్ ప్రియాంకా వేశధారణకు కుర్రిసిపోయి ఆమెను మరింత అందంగా మార్చేసింది. మెహందీ వేడుక కోసం ప్రియాంక ట్రెడిషనల్ లెహంగా వదిలేసి డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన వైట్ ఫ్లోరల్ గౌన్ ఎంచుకున్నారు. ఈ డ్రెస్‌లో కలర్‌ఫుల్ ఎంబ్రాయిడరీ, ప్రిన్సెస్ స్టైల్ కార్సెట్ ఉండడంతో ఆమె ఫెయిరీటేల్ ప్రిన్సెస్‌లా మెరిశారు.
మెహందీ లుక్‌లో ఆమె మెక్అప్ కూడా చాలా సాఫ్ట్‌గా, పింక్ లిప్స్, రోజీ చీక్స్, వేవీ హెయిర్‌తో మరింత అందంగా కనిపించారు. పెళ్లి వేడుకల్లో ప్రియాంక తన ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా పాల్గొన్నారు. సిద్ధార్థ్ చోప్రా, తమిళ-తెలుగు నటి నీలం ఉపాధ్యాయ ను వివాహం చేసుకోబోతున్నారు. 2019 నుండి డేటింగ్‌లో ఉన్న ఈ జంట, నిక్ జోనాస్-ప్రియాంకతో కలిసి చాలా ఈవెంట్స్‌లో పాల్గొన్నారు.
ప్రియాంకా ఈ వేడుకల్లో మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌తో అదరగొట్టారు. ఫ్యామిలీ వేడుకలు, స్టన్నింగ్ లుక్స్ – ప్రియాంకా స్టైల్ మామూలుగా లేదనిపించింది!