
Salman Khan Remuneration For Sikandar:
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మళ్లీ మాస్ అవతారంలో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’, 2025 మార్చి 28న ఈద్ సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, సోషల్ డ్రామా నేపథ్యంలో నడుస్తుందని సమాచారం.
సల్మాన్ ఖాన్ ఈ చిత్రానికి ఏకంగా రూ. 100 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా, సినిమా విజయాన్ని బట్టి ఆయనకు ప్రాఫిట్ షేర్ కూడా లభించనున్నట్లు బలమైన టాక్ నడుస్తోంది.
ఈ సినిమాను సాజిద్ నడియాద్‌వాలా నిర్మిస్తున్నారు. సినిమా థియేటర్లలో విడుదలకు ముందే పోస్ట్-థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 150 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అంటే, నిర్మాత ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయినట్టే.
ఇటీవలే విడుదలైన ‘సికందర్’ టీజర్ లో సల్మాన్ ఖాన్ మళ్లీ తన స్టైల్‌లో మాస్ లుక్‌లో కనిపించారు. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్‌కు ఆయన నుంచి పక్కా మాస్ ఎంటర్టైనర్ రాబోతోందన్న హింట్ టీజర్‌లో కనిపించింది.
ఇదే సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో రాబోతున్న తొలి సినిమా. మురుగదాస్ స్టైల్, సల్మాన్ మాస్ అపీల్ కలిస్తే సూపర్ హిట్ ఖాయమనే అంచనాలు భారీగా ఉన్నాయి. మిగతా నటీ నటులు, ఫుల్ ట్రైలర్, సాంగ్స్ వంటి విషయాల్లో మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.