
Bigg Boss 8 telugu Nainika Remuneration
బిగ్ బాస్ తెలుగు 8 ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారుతోంది. ఇటీవల సోనియా ఎలిమినేషన్ తర్వాత, ఆదిత్య ఓం మధ్య వారం ఎలిమినేషన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తాజా వార్తల ప్రకారం, నైనిక తదుపరి ఎలిమినేట్ అవ్వనున్న కంటెస్టెంట్ అని తెలుస్తోంది. షోకి కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు, అందువల్ల ఈ వారం నాటికి డ్రామా ప్రారంభమవుతుందని చెప్పవచ్చు.
ఆదిత్య ఓం ఎగ్జిట్ తరువాత, ఇప్పుడు ప్రేక్షకులు నైనిక వైపు దృష్టి పెట్టారు. తాజా అప్‌డేట్‌ల ప్రకారం, నైనిక ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఓటింగ్ ఫలితాల ప్రకారం, నైనిక, ఆదిత్య ఇద్దరూ తక్కువ ఓట్లతో చివరి రెండు స్థానాల్లో నిలిచారు, దీనితో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్‌లో నైనిక ఎలిమినేట్ కాబోతున్నారు.
నైనిక బిగ్ బాస్ ఇంట్లో ఐదు వారాలుగా ఉంటోంది. ఈ సమయంలో ఆమె సుమారు ప్రతి వారం 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ వారం ఆమె ఎలిమినేట్ అయిపోయినా కూడా.. మొత్తం ఆమె సుమారు 6 నుండి 7 లక్షల వరకు సంపాదించినట్లు అంచనా వేయవచ్చు.
ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 8లో చాలా మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. మొదటిగా బేజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వగా.. తరువాత శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, ఆదిత్య ఓం బయటకు వెళ్లారు. ఇప్పుడు నైనిక ఈ జాబితాలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.