
Salman Khan watch:
సల్మాన్ ఖాన్ అంటే సినిమాలకే కాదు, ఫ్యాషన్‌కి, లగ్జరీ లైఫ్‌స్టైల్‌కి కూడా బ్రాండ్ అంబాసిడర్. ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపించే సల్మాన్‌కి హై-ఎండ్ వాచ్‌లంటే అంతగా ఇష్టం. ఇప్పుడు Jacob & Co.తో కలిసి తన ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ని రిలీజ్ చేశాడు.
The World Is Yours Dual Time Zone – ప్రత్యేకతలు
ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ పేరు ‘The World Is Yours Dual Time Zone’. ఇది కేవలం ఒక వాచ్ కాదు, సల్మాన్ తండ్రి సలీం ఖాన్‌కి ఇచ్చిన స్పెషల్ ట్రిబ్యూట్. టైం విలువను, ఫ్యామిలీ బాండింగ్‌ను సింబలైజ్ చేసేలా Jacob & Co. దీన్ని డిజైన్ చేసింది.
ఈ వాచ్ స్పెషల్ ఫీచర్లు:
దీని ధర – రూ. 61 లక్షలు!
యూనిక్ డిజైన్ – డయల్‌పై గ్లోబ్ మాప్, డ్యూయల్ టైం జోన్ ఫీచర్
భారతీయ టచ్ – ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అయిన కాషాయ, గ్రీన్ షేడ్స్
సల్మాన్ ముద్ర – బ్యాక్‌సైడ్ ‘Salman Khan’ ఇన్‌స్క్రిప్షన్, డయల్‌పై S.K. ఇనిషియల్స్
కస్టమ్ బాక్స్ – సల్మాన్ ఫేవరేట్ బ్రేస్‌లెట్ కలర్ టర్క్వాయిజ్ థీమ్
సల్మాన్ ఖాన్ ఏవైనా స్టైలిష్ వాచ్‌లు వాడితే అవి ట్రెండింగ్ అవుతాయి. గతంలోనూ Rolex, Patek Philippe లాంటి బ్రాండ్లను ధరించిన సల్మాన్ ఇప్పుడు ఈ Jacob & Co. లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.
ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన లేటెస్ట్ మూవీ ‘సికందర్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.