HomeTelugu Big StoriesUnstoppable షోలో Ram Charan వేసుకున్న హుడీ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

Unstoppable షోలో Ram Charan వేసుకున్న హుడీ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

Guess the price of hoodie Ram Charan wore for Unstoppable show!
Guess the price of hoodie Ram Charan wore for Unstoppable show!

Ram Charan in Unstoppable with NBK:

తెలుగు సినిమా గ్లోబల్ ఇమేజ్ ను పెంచిన హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్, ఎన్నో విమర్శలు ఎదుర్కొని, తానేంటో నిరూపించుకున్నాడు. చిరుత సినిమా నుంచి మొదలుకొని, ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు.

ఇటీవల చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది. అయితే, సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నా మేకర్స్ నుంచి సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ స్వయంగా ప్రమోషన్స్ చేపట్టాడు.

తాజాగా రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొని సందడి చేశాడు. ఈ షో షూటింగ్ లో చరణ్ ధరించిన బ్లాక్ హూడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ హూడీని చూసి ఫ్యాన్స్ దీని ధర ఎంత అని గూగుల్ లో సెర్చ్ చేయగా, అది ప్రముఖ బ్రాండ్ అమిరి కి చెందినదిగా, ధర అక్షరాలా రూ. 2 లక్షలు పైచిలుకగా ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

ఇక గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ తదుపరి సినిమా RC16 షూటింగ్ స్టార్ట్ కానుంది. గ్లోబల్ రేంజ్ లో స్టైల్ మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్, మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.

ALSO READ: Kalki 2898 AD కలెక్షన్స్ కి Mahesh Babu కి లింక్ ఏంటో చెప్పిన నాగ్ అశ్విన్!

Recent Articles English

Gallery

Recent Articles Telugu