
Rashmika Mandanna Net Worth:
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా, కేవలం 28 ఏళ్లకే ₹66 కోట్ల నెట్‌వర్త్‌ను సంపాదించేసింది. తాజాగా ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఆమె సినిమా పారితోషికం రూ. 4 కోట్లు నుంచి రూ. 8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే, దక్షిణ భారత సినిమాల్లో కాస్త తక్కువగా, బాలీవుడ్‌లో ఎక్కువగా పారితోషికం తీసుకుంటుందట.
తాజాగా “చావా” హిట్ తర్వాత, ఇప్పుడు రష్మిక సల్మాన్ ఖాన్‌తో నటించిన “సికందర్” రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమా పెద్ద హిట్ అయితే, రష్మిక సంపద త్వరలోనే ₹100 కోట్ల మార్క్‌ను దాటనుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రష్మిక సినిమాల మీద మాత్రమే ఆధారపడటం లేదు. ఆమె ప్రముఖ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీగా సంపాదిస్తోంది. అంతేకాకుండా, కొంతకాలంగా బ్యూటీ మరియు స్కిన్‌కేర్ బ్రాండ్‌లలో పెట్టుబడులు పెడుతూ తన సంపదను మరింత పెంచుకుంటోంది.
View this post on Instagram
అంతేకాదు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ముంబైలో లగ్జరీ ఫ్లాట్‌తో పాటు, హైదరాబాద్, బెంగళూరు, గోవా, కూర్గ్‌లలో కూడా ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. తన కుటుంబ వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టి స్థిరమైన ఆదాయాన్ని పొందేలా చూసుకుంటోంది.
రష్మిక మందన్నా లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఆమె దగ్గర ఆడి, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి హై-ఎండ్ కార్లు ఉన్నాయి. అయినా ఆమె కెరీర్ ప్రారంభంలో కొనుగోలు చేసిన హ్యూందాయ్ క్రెటా కారును ఇప్పటికీ తన గ్యారేజీలో ఉంచుకుంది.
అంతేకాదు, ఇంటర్నేషనల్ ట్రిప్స్, లగ్జరీ వెకేషన్లు కూడా రష్మికకు చాలా ఇష్టమైనవి. సంపాదనను స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేయడమే కాకుండా, లైఫ్‌ని ఆనందంగా కూడా గడుపుతోంది.
ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతానికి “సికందర్” మూవీ సక్సెస్‌పై దృష్టి పెట్టగా, త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులతో అభిమానులను అలరించనుంది!
ALSO READ: Dhanush Hollywood Movie ఇప్పుడు తెలుగులో ఎక్కడ చూడచ్చంటే