Shahrukh Khan first remuneration:
బాలీవుడ్లో కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న షారుక్ ఖాన్, ఒక సాధారణ వ్యక్తిగా ప్రారంభమై భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. బాలీవుడ్ లో ఇప్పుడు అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఎందరికో స్ఫూర్తి ఇస్తున్నారు.
1980ల చివరలో టెలివిజన్ ద్వారా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన షారుక్, 1990లోప్రారంభంలో సినిమాలలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2017లో వచ్చిన రైస్ సినిమా ప్రమోషన్ సమయంలో షారుక్ తన తొలి జీతం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
పంకజ్ ఉదాస్ సంగీత కచేరీలో అషర్గా పనిచేసినప్పుడు షారుఖ్ కేవలం రూ.50 సంపాదించారట. ఆ జీతంతో స్నేహితులతో కలిసి ఆ డబ్బులు నిల్వ చేసి తాజ్ మహల్ కూడా సందర్శించాడని చెప్పారు కింగ్ ఖాన్. ఇప్పుడు 2024లో అతని సంపాదన ఎన్నో రెట్లు ఎక్కువ. ఫోర్బ్స్ ప్రకారం, ప్రతి సినిమాలో షారుఖ్ ఖాన్ రూ.150 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.
బాలీవుడ్లో అత్యధిక పారితోషికం పొందే నటుడిగా తన మొదటి స్థానం నిలబెట్టుకున్నారు. 2023లో షారుక్ “పఠాన్”, “జవాన్” వంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. తర్వాత “డుంకీ” సినిమా కూడా రూ.450 కోట్ల మార్క్‌ని దాటి మంచి విజయాన్ని సాధించింది.
ఇప్పుడిప్పుడే తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్న షారుక్ ఖాన్, తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి “కింగ్” అనే కొత్త చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. అభిమానులు ఈ చిత్రంలో షారుక్, సుహానా కలిసి తెరపై కనిపించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ALSO READ: Prabhas Fauji సినిమాకి నిర్మాతలు పెడుతున్న బడ్జెట్ ఎంతో తెలుసా?