
First Indian Actor to Charge ₹1.25 Crore for a Movie:
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో ఆయన తన ఫ్యామిలీ గురించి సరదాగా మాట్లాడారు. ఇంట్లో తన కొడుకులు, మనవరాళ్లు ఎక్కువగా ఉండటంతో అది “లేడీస్ హోస్టల్”లా మారిపోయిందని అన్నారు. ఇక తన వారసత్వాన్ని కొనసాగించడానికి మనవడు కావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. “ఈ సారి అయినా అబ్బాయి పుట్టాలి” అంటూ తన కొడుకు రామ్ చరణ్‌కి సజెషన్ ఇచ్చారు. చిరు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి.
చిరంజీవి భారతదేశంలో సింగిల్ ఫిల్మ్‌కు 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి నటుడు. 1990లలో అమితాబ్ బచ్చన్ రూ. 90 లక్షలు ఫీజుగా తీసుకుంటుండగా, 1992లో “ఆపద్బాంధవుడు” సినిమాకు చిరంజీవి రూ. 1.25 కోట్లు తీసుకున్నారు. దీంతో భారతీయ సినిమా రంగంలో హైయెస్ట్ పేడ్ యాక్టర్‌గా రికార్డు సృష్టించారు. అతని విజయాన్ని చూసి, తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు కూడా రెమ్యూనరేషన్ పెంచుకున్నారు.
1992లో ప్రముఖ మ్యాగజైన్ The Week, చిరంజీవిని “Bigger than Bachchan” అని అభివర్ణించింది. ఎందుకంటే బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ హవా కొనసాగుతుండగా, తెలుగు సినిమాల్లో చిరంజీవి గోల్డెన్ ఎరా నడుస్తోంది. “ఇంద్ర” (2002) బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన టాలీవుడ్‌లో నిజమైన మెగాస్టార్‌గా నిలిచారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత, “ఖైదీ నం.150” (2017), “సైరా నరసింహారెడ్డి” (2019) వంటి విజయాలు అందుకున్నారు.
69 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి టాలీవుడ్‌లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన ప్రతి సినిమా కోసం రూ. 40 కోట్లు తీసుకుంటున్నారు.
ఆయన తదుపరి చిత్రం “విశ్వంభర” 2025 జనవరి 10న విడుదల కానుంది.
2024లో ఆయన భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారం “పద్మ విభూషణ్” అందుకున్నారు.
చిరు సక్సెస్ స్టోరీ నిజంగా ఇన్‌స్పిరేషన్!