Pushpa 2 trailer launch event:
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పట్నాలో నిర్వహించిన పబ్లిక్ ఈవెంట్ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. హిందీ హార్ట్‌ల్యాండ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు రెండు లక్షల మంది హాజరయ్యారని మేకర్స్ అంచనా వేశారు. సాధారణంగా పట్నా వంటి నగరాలు సినిమా ప్రమోషన్లలో భాగంగా ఉండవు. అందుకే, ఈ ప్రాంతంలో ఈవెంట్ చేయడం అనేది ఎంతో రిస్కీ. కానీ, మేకర్స్ ఈ సవాలును స్వీకరించి, భారీ విజయాన్ని సాధించారు.
ఈ ఈవెంట్‌కు మేకర్స్ దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొదట ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు కానీ, వారు ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలేశారు. దీంతో హైదరాబాద్‌కు చెందిన యూ వి మీడియా ఈ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది.
పట్నాలో సదుపాయాల కొరత ఈవెంట్‌కు ప్రధాన అడ్డంకి అయింది. కారవాన్లు లభించకపోవడంతో అవి లక్నో నుంచి తీసుకురావాల్సి వచ్చింది, దీనికి లక్షా నలభై వేల రూపాయల ఖర్చు జరిగింది. అల్లు అర్జున్ కోసం లగ్జరీ కార్ అవసరమవ్వడంతో దాన్ని జార్ఖండ్ నుంచి తెప్పించాల్సి వచ్చింది. డాన్స్ గ్రూప్‌లు కూడా పట్నాలో అందుబాటులో లేకపోవడంతో, వాటిని ఢిల్లీ, ముంబై నుంచి తీసుకురావడం జరిగింది.
ఈవెంట్ మొత్తం ఖర్చులు సాధారణంగా ఖర్చు అయ్యే దానికంటే సగటున 1.5 రెట్లు ఎక్కువ అయ్యాయని చిత్రబృందం వెల్లడించింది. ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి టీం 15 రోజుల ముందే ప్రచారం ప్రారంభించింది. పట్నా మొత్తం పోస్టర్లు, హోర్డింగ్‌లతో నింపేశారు. స్థానిక యువతను ఆకర్షించేందుకు ఈవెంట్‌లో బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
పట్నా మేయర్, కార్పొరేటర్లకు పాసులు ఇచ్చి వారి సహాయంతో ప్రజలను సమీకరించారు. పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ఏడురోజుల్లో ఏడు నగరాల్లో ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ముంబై ఈవెంట్ మాత్రమే ప్రెస్‌మీట్‌గా ఉండగా, ఇతర అన్ని నగరాల్లో పెద్ద పబ్లిక్ ఈవెంట్లు జరుగనున్నాయి. ఇంతేకాక, దుబాయ్‌లో కూడా ఒక పెద్ద ఈవెంట్ జరగనుంది.