Upcoming Pan-indian Movies in Telugu:
టాలీవుడ్ లో చాలానే స్టార్ హీరో సినిమాలు విడుదల కి రెడీ అవుతున్నాయి. స్టార్ హీరో సినిమా అనగానే అది పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి బాహుబలి పుణ్యమా అని.. ఈమధ్య స్టార్ హీరోలు అందరూ ప్యాన్ ఇండియా సినిమాల మీదే మొగ్గు చూపుతున్నారు. ఒక్కో సినిమాకి కనీసం రెండు మూడు వందల బడ్జెట్ ఉంటే తప్ప సినిమా ఓకే కూడా చేయడం లేదట. ఇక త్వరలో ఈ upcoming Pan-indian movies బడ్జెట్ లు ఇప్పుడు చూద్దాం.
Vishwambhara:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. సోషియో ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి 200 కోట్ల బడ్జెట్ పెట్టారట. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 10న విడుదల కాబోతుంది.
Devara:
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా కోసం 350 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది.
Raja Saab:
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న హారర్ కామెడీ రాజా సాబ్. ముందు ఇది చిన్న బడ్జెట్ సినిమా అని అందరూ అనుకున్నారు కానీ.. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమా అని.. సినిమా కోసం 400 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు నిర్మాత చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో ప్రభాస్ పేరు మొదటే ఉంటుంది. ప్రభాస్ చేతిలో చాలానే భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. అందులో రాజా సాబ్ సినిమా బడ్జెట్ కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల కాబోతోంది.
Game Changer:
రామ్ చరణ్ హీరోగా.. శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి ముందు ఎంత బడ్జెట్ అనుకున్నా.. డైరెక్టర్ శంకర్ కాబట్టి అది కచ్చితంగా తడిసి మోపడుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబర్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి 450 కోట్ల బడ్జెట్ ఖర్చయిందట.
Pushpa 2:
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. ఆ సినిమాకి సీక్వెల్ కాబట్టి పుష్ప 2 మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం 500 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కాబోతోంది.
SSMB29:
ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. రాజమౌళి సినిమా కాబట్టి ఫిక్స్ అయినా కూడా.. సినిమా ఖచ్చితంగా అదే డేట్ న విడుదల అవుతుందో లేదో డౌటే. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకి రాబోతున్న ఈ సినిమా కోసం ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. రాజమౌళి మహేష్ బాబు వంటి క్రేజీ కాంబినేషన్లో సినిమా కాబట్టి.. ఆ మాత్రం బడ్జెట్ పర్లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.