Allu Arjun Trivikram Movie Budget:
బన్నీ ఫాన్స్ మాత్రమే కాక.. టాలీవుడ్ సినీ అభిమానులు అందరూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు ఈ ఇద్దరూ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు.
ఇప్పుడు వారి కాంబో లో వస్తున్న మరొక సినిమా పాన్-ఇండియా రేంజ్ లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఈ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతుంది చిత్ర బృందం. పుష్ప 2 చుట్టూ ఉన్న హైప్ తర్వాత అభిమానులు అల్లు అర్జున్ నుంచి మరో భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ కొత్త సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 400 నుంచి 500 కోట్లు ఉంటుందని సమాచారం.
ఇది బన్నీ కెరియర్ లోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా నిలవవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్‌కు సన్నిహితుడైన బన్నీ వాసు ఈ ప్రాజెక్ట్ కోసం భారీ పెట్టుబడులు అవసరమని, షూటింగ్ మొదలయ్యే వరకు చాలా సమయం పట్టవచ్చని పేర్కొన్నారు.
త్రివిక్రమ్ కుటుంబ కథలను ఎంటర్టైనింగ్ పద్ధతిలో చెప్పడంలో దిట్ట. అయితే ఈసారి ఆయన కొత్త తరహా ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రం సోషియో ఫాంటసీగా ఉంటుందని.. సామాజిక అంశాలు, ఫాంటసీ అంశాలు కలిపి ఉంటుందని తెలుస్తోంది. ఇది త్రివిక్రమ్‌కి కొత్త సవాలు అయినప్పటికీ.. అభిమానులు ఈ కొత్త జానర్‌లో సినిమా చూడాలని ఆసక్తిగా ఉన్నారు.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే వరకు చాలా సమయం పడుతుంది. సెట్లు, వేషధారణలు, మొత్తం లుక్ చాలా డిఫరెంట్ గా.. అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్‌పై చాలా సమయంగా పనిచేస్తున్నారనీ, అల్లు అర్జున్ కథ వినగానే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇప్పుడు మొత్తం టీం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ముందు అన్నీ సిద్ధం చేసుకునే పనిలో ఉంది.
Read More: Game Changer మళ్ళీ వాయిదా పడిందా? కొత్త విడుదల తేదీ ఎప్పుడో తెలుసా?