
Nayanthara remuneration:
దక్షిణ భారత సినీ పరిశ్రమలో “లేడీ సూపర్ స్టార్” అనిపించుకున్న నయనతార ఇప్పుడు బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్ ద్వారా కూడా కోట్లలో సంపాదిస్తోంది. తాజాగా ఆమె ఓ సాటిలైట్ డిష్ కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్‌కు 50 సెకన్ల మాత్రమే స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఏకంగా 5 కోట్లు తీసుకుందట. బాలీవుడ్‌లో కూడా ఇంత భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం అరుదు.
నయనతార 80కి పైగా చిత్రాల్లో నటించి, అన్ని ప్రధాన చిత్ర పరిశ్రమల్లో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘చంద్రముఖి’, ‘గజిని’, ‘శ్రీరామరాజ్యం’ వంటి హిట్ సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించింది. 2023లో బాలీవుడ్‌లో ‘జవాన్’ ద్వారా అరంగేట్రం చేసి 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది.
నయన్ నెట్ వర్త్ సుమారు 200 కోట్లు ఉండగా, చెన్నైలో 100 కోట్ల విలువైన అపార్ట్మెంట్, ప్రైవేట్ జెట్, మెర్సిడెస్ మేబ్యాక్, బీఎండబ్ల్యూ సిరీస్ 7 లాంటి లగ్జరీ కార్లు కలిగిన సెలెబ్రిటీ.
నయనతార త్వరలో ‘ది టెస్ట్’, ‘టాక్సిక్’, ‘రాకాయీ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలతో పాటు యాడ్స్, పర్సనల్ బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూ మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా కొనసాగుతోంది.