
Vishwak Sen bodyguard salary:
సినీ తారలు ఎప్పుడూ అభిమానుల గుంపులతో నిండిపోతారు. రోడ్ల మీద, ఈవెంట్స్‌లో, షూటింగ్స్‌లో – ఎక్కడికెళ్లినా వారికి భద్రత అవసరమే. అందుకే స్టార్స్ వ్యక్తిగత బాడీగార్డ్స్‌ను నియమించుకుంటారు. చాలా మంది హీరోలు తమ రక్షణ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెడతారు. అలాంటి వారిలో విశ్వక్ సేన్ ఒకరు.
విశ్వక్ సేన్ వ్యక్తిగత భద్రతను చూసుకునే వ్యక్తి రోఠాస్ చౌధరీ. హర్యానాలో పుట్టిన ఈయన, 7 అడుగుల పొడవుతో ఎవరినైనా భయపెట్టగల కటౌట్. అతను సినిమా రంగంలో చాలా కాలంగా బాడీగార్డ్‌గా పని చేస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్‌కు సెక్యూరిటీ గార్డు కూడా! ఇప్పుడు విశ్వక్ సేన్ కోసం పూర్తిగా డెడికేట్ అయ్యారు.
విశ్వక్ సేన్ తన బాడీగార్డ్‌కు నెలకు రూ. 2 లక్షలు పే చేస్తున్నాడు. అంతేకాకుండా, అతనికి ఒక ఫ్లాట్ ఇచ్చాడు, పిల్లల చదువు ఖర్చులు కూడా చూసుకుంటున్నాడు. స్టార్స్ తమ భద్రత కోసం ఎంత ప్రాముఖ్యత ఇస్తారో దీని ద్వారా అర్థమవుతుంది.
ఈరోజుల్లో పెద్ద స్టార్స్ బాడీగార్డ్స్‌ను తప్పనిసరిగా నియమించుకుంటున్నారు. కొందరికి సెక్యూరిటీ అవసరం అనిపించదు. ఉదాహరణకు, సైఫ్ అలీ ఖాన్ ఇంటికి కూడా సెక్యూరిటీ గార్డు ఉండడు. కానీ విశ్వక్ సేన్ లాంటి హీరోలు తమ రక్షణ కోసం మంచి భద్రత ఏర్పాటు చేసుకుంటారు.
సినీ తారల భద్రత ఎంత ముఖ్యమో ఈ సంఘటనల ద్వారా అర్థమవుతోంది. పెద్ద సంఖ్యలో అభిమానులు చేరి, అనుకోకుండా ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, వ్యక్తిగత భద్రతకు హీరోలు పెద్ద మొత్తంలో ఖర్చు పెడతారు.
ALSO READ: Nandamuri Mokshagna సరసన ఆ హీరోయిన్ ఉంటే సూపర్ అంటున్న ఫ్యాన్స్