Game Changer Songs:
సంక్రాంతికి రాబోతున్న రామ్ చరణ్ మూవీ Game Changer పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2025 జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సామాజిక అంశాలను చర్చిస్తారని తెలుస్తోంది. సినిమాలోని పాటల కోసం శంకర్ ఎప్పుడూ స్పెషల్ ప్లానింగ్ చేస్తారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, పాటల చిత్రీకరణలో భారీ ఖర్చు చేశారట.
View this post on Instagram
ఈ సినిమాలో “జరగండి” అనే సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇటీవల ఈ పాట గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలోని పాటలన్నీటికీ 75 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా ఈ ఒక్క పాట కోసం నిర్మాత దిల్ రాజు దాదాపు ₹20 కోట్లు ఖర్చు చేశారట. ఈమధ్య కాలంలో ఒక సాంగ్‌కి భారీ ఖర్చు చేసిన చిత్రమిదే అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
పాట చిత్రీకరణ కోసం రోడ్ స్టైల్ సెటప్‌ను సిద్ధం చేసి, వేలాది మంది డ్యాన్సర్లను తీసుకువచ్చి, ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా షూట్ చేశారు. థమన్ కంపోజ్ చేసిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని టాక్ ఉంది. రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తోంది.
ALSO READ: Marco OTT విడుదల ఇంత త్వరగానా?