Pushpa 2 Collections:
Pushpa 2: ది రూల్ చిత్ర విజయం ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహం రేకెత్తిస్తోంది. తాజాగా, PVR INOX ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లి పుష్ప 2 విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో 2,800 కోట్ల రూపాయల ఆదాయం సాధించామని, పుష్ప 2 చిత్రంతో మరింత ఆదాయం ఆశిస్తున్నామని తెలిపారు.
సంజీవ్ కుమార్ పుష్ప 2తో పాటు బేబీ జాన్, ముఫాసా: ది లయన్ కింగ్ వంటి సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశముందని తెలిపారు. పుష్ప 2కు అడ్వాన్స్ బుకింగ్స్‌లతో పాటు ఈ రెవెన్యూ రావడానికి వెనక ఉన్న సినిమాలు స్త్రీ 2, సింఘం అగైన్, భూల్ భులయ్య 3 అని చెప్పారు.
సంజీవ్ మాట్లాడుతూ, ముందస్తు ప్రణాళికలు, సినిమా విడుదల తేదీలను వాయిదా వేసిన నిర్మాతల నిర్ణయాన్ని ప్రశంసించారు. వారు పెట్టుబడులు వృథా కాకుండా ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు.
View this post on Instagram
ఈ ఏడాది పాత సినిమాల రీ-రిలీజ్ పెద్ద మొత్తంలో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించిందని, వీటి కోసం ప్రత్యేక టీమ్‌ను నియమించామని సంజీవ్ వెల్లడించారు. అలాగే, పండుగలు, సెలవులు వంటి సందర్భాల్లో థియేటర్లను స్క్రీన్ షేరింగ్ సమస్యలు ఎదురవుతాయని, కానీ నిర్మాతలు దీన్ని అధిగమించడానికి బాగానే వ్యవహరిస్తున్నారని తెలిపారు.
2025 నాటికి 100 కొత్త స్క్రీన్లను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సంజీవ్ పేర్కొన్నారు. పుష్ప 2తో పాటు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ చిత్రాలు కూడా భారీ విజయాలను సాధించగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ ‘సికందర్’, హృతిక్ రోషన్ ‘వార్ 2’, అవతార్: ఫైర్ అండ్ అష్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశముందని చెప్పారు.
ALSO READ: Allu Arjun భార్య స్నేహ రెడ్డి Revanth Reddy కి ఎలా చుట్టం అవుతుంది అంటే!