HomeTelugu TrendingComedian Satya ఒక్క రోజు కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Comedian Satya ఒక్క రోజు కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Guess how much remuneration Comedian Satya receives per day
Guess how much remuneration Comedian Satya receives per day

Comedian Satya remuneration:

తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం, సునీల్ వంటి ప్రముఖ హాస్య నటులు ఉన్నట్లే, సత్య కూడా తనదైన శైలిలో టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా ఎదుగుతున్నాడు. గత ఐదేళ్లలో వెన్నెల కిషోర్ అగ్ర హాస్య నటుడిగా ఎదిగినా, ఇప్పుడు సత్య కమెడియన్‌గా ఒక ప్రత్యేక స్థానం సంపాదించాడు.

ఇటీవల కాలంలో సత్య ఎన్నో మంచి మంచి సినిమాలతో బిజీగా ఉంటూ.. స్టార్ హీరోల పక్కన కూడా పూర్తిస్థాయి పాత్రలను పోషిస్తున్నాడు. సత్యకు ఇటీవలే నాగ శౌర్య నటించిన రంగబలి చిత్రంలో చేసిన అద్భుత నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు సత్య తనదైన శైలిలో మత్తు వదలరా 2 సినిమాలో కూడా అద్భుతంగా నటించి.. సినిమా మొత్తం మీద అతిపెద్ద హైలైట్ గా నిలిచాడు.

ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్‌లో తన నటన, బాగా కామెడీ జనరేట్ చేసే డైలాగులు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. సత్యకు మంచి డిమాండ్ ఉండటంతో రోజు రోజుకు అతని క్రేజ్ కూడా పెరుగుతూ వస్తోంది.

ప్రస్తుతం సత్య రోజుకు రెండు లక్షల రూపాయల చప్పున పారితోషికం అందుకుంటున్నాడట. చిన్న సినిమాల్లో కూడా పెద్ద మొత్తంలో సత్యకు పారితోషికం లభిస్తోంది. కామెడీ సినిమా అంటే కచ్చితంగా సత్య కామెడీ ఉండాల్సిందే అని డైరెక్టర్లు, నిర్మతలు కూడా ఖచ్చితంగా చెబుతున్నారు.

Read More: Kalki 2898 AD సినిమా కోసం హీరోయిన్ నాలుగు రోజులు షూటింగ్.. కానీ కనిపించింది 10 సెకండ్లే

మరోవైపు ప్రతి సినిమాతోనూ.. తనదైన శైలిలో ఆకట్టుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య. ఇలాగే మళ్లీ మంచి పాత్రలు దొరికితే.. సత్య మీద ప్రేక్షకులకి ఉన్న అభిమానంతో పాటు రెమ్యూనరేషన్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu